Pond Soil : చెరువు మట్టితో చేనుకు చేవ – తగ్గనున్న రసాయన ఎరువుల వినియోగం

ముఖ్యంగా గ్రామాల్లో చెరువుకున్న ప్రాధధాన్యత అంతా ఇంతా కాదు. చెరువు ఆధారంగానే ఊరుఊరంతా బతికేది . చెరువుల్లో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది.

Pond Soil : చెరువు మట్టితో చేనుకు చేవ – తగ్గనున్న రసాయన ఎరువుల వినియోగం

Pond Soil Use In Agriculture

Pond Soil : పంట పొలాల్లో సారం నానాటికీ తగ్గిపోతోంది. సేంద్రియ పదార్థాలు, సూక్ష్మ పోషకాల శాతం అంతకంతకూ పడి పోతోంది. ఇందుకు కారణం రైతులు రసా యన ఎరువులు వాడటమే. ఫలితంగా భూమి సహజ గుణాన్ని కోల్పోతోంది. పంటకు కావాల్సిన పోషకాలను ఇవ్వకపోవడంతో దిగుబడి పడిపోతోంది. రైతుకు నష్టమే మిగులుతోంది. ఈ తరుణంలో చెరువు మట్టితో చేయాల్సింది  జవసత్వం కల్పించడమే. అప్పుడే పంటలు పండుతాయి.

ప్రస్తుతం వ్యవసాయం రసాయనాలమయమైంది. రైతులు మోతాదుకు మించి బస్తాల కొద్దీ రసాయనాలను గుమ్మరించడం అలవాటైంది. ఒకరిని చూసి మరొకరు ఈ విధానాన్నే అనుసరిస్తున్నారు. దీంతో భూములు నిస్సారమవుతున్నాయి. ఇలాంటి భూముల్లో ఇంకా రసాయనాల వాడకం భయంకరంగా పెరిగిపోతోంది.

Read Also : Watermelon Cultivation : పుచ్చసాగులో మెళకువలు.. వేసవిలో మంచి డిమాండ్

ఈ విధానాలతో మనిషికి ఆరోగ్యంతో పాటు భూమికి పోషక సామర్థ్యం చేసేందుకు ఒండ్రుమట్టిని వాడడమే ఏకైక మార్గమం. ముఖ్యంగా గ్రామాల్లో చెరువుకున్న ప్రాధధాన్యత అంతా ఇంతా కాదు. చెరువు ఆధారంగానే ఊరుఊరంతా బతికేది . చెరువుల్లో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది.

చెరువు మట్టితో ఎన్నో ప్రయోజనాలు :
ఆశించిన స్థాయిలో నీరు నిల్వలేక బావుల్లోను నీళ్లు తగ్గాయి. అంతే కాదు చెరువు మట్టితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. రసాయనిక ఎరువులను మించిన పోషకాలు చెరువు మట్టి వినియోగం ద్వారా పంటలు సమృద్ధిగా అందుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా తెలిజేస్తున్నారు. సాధారణంగా చెరువు మట్టిలో 70 శాతం ఒండ్రుమట్టి, 30 శాతం బంకమట్టి ఉంటుంది.

దీంతో పాటు పోషకాలు ప్రధానంగా నత్రజని, భాస్వరం, పొటాష్, సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. చెరువు మట్టిని పంట పొలాలకు తోలడం ద్వారా  పంటలకు ఆశించకుండా మిత్ర సూక్ష్మజీవులు చేరి, పంటలకు మేలు చేకూరుస్తాయి. ఇటు పంటకు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.  అంతే కాదు నీటిని నిలుపుకొనే శక్తి 4 నుండి 7 శాతం పెరుగుతుంది.  రసాయన ఎరువుల వినియోగాన్ని 10 నుండి 15 శాతం వరకు తగ్గించుకోవచ్చు.

సాధారణంగా వేసవిలో చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోతాయి .  కొన్నిసార్లు పూర్తిగా అడుగంటడం వల్ల ఎండిపోతాయి. అలాంటి చెరువుల్లోని మట్టిని నేరుగా పొలాలకు తోలుకోరాదు. పంట పొలాలకు చెరువు మట్టిని తోటడానికి ముందు నేలపరీక్ష తప్పనిసరి చేయించాలి. లవణ సాంద్రత 4 కన్నా తక్కువ, నేలలో ఉదజని సూచిక 8.4 కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే చెరువు మట్టిని వాడాలి.

చెరువు లోపల పూడికమట్టి రెండు నుండి 3 అడుగుల లోతువరకు మట్టిని పరీక్షల అనంతరం పోషకాల శాతాన్ని బట్టి తోలుకోవాలి. ఎకరాకి 20 నుండి 25 ట్రాక్టర్లు తోలితే సరిపోతుంది. మే నెలే అనుకూలం. ఒక్కసారి ఒండ్రుమట్టిని పొలాల్లో వేస్తే నాలుగేండ్ల వరకు పంటలకు పుష్కలంగా పోషకాలు అందుతాయి. ఒండ్రుమట్టితో అన్ని ప్రయోజనాలు ఉన్నా రైతులకు ఈ విషయం గురించి తెలియర రసాయనిక ఎరువులు వాడడంతో పంటల దిగుబడి అంతంతగానే ఉంటుంది.

Read Also : Tomato Staking Cultivation : లాభాలు పండిస్తున్న స్టేకింగ్ టమాట సాగు