chilli
Precautions in Chilli Cuts : రైతులు పంట పండించటంపైనే కాదు, పంట చేతికొచ్చిన తరువా కొన్ని యాజమాన్యపు మెళకువలను పాటించటం ద్వారా ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర దక్కి, సాగు లాభసాటిగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ప్రధాన వాణిజ్యపంటల్లో ఒకటైన మిరప విషయానికి వస్తే చాలా ప్రాంతాల్లో మిర్చి కోతలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో అధిక ధర పొందాలంటే మిరప కోతల అనంతరం చేపట్టాల్సిన మెళకువలను గురించి తెలియజేస్తున్నారు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. వీరన్న .
READ ALSO : Chilli Crop : మిర్చి పంటపై తెగుళ్ల దాడి.. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చు
విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించే మిరప సాగుపై తెలుగు రాష్ట్రాల రైతులకు మక్కువ ఎక్కువనే చెప్పాలి. అంతర్జాతీయంగా మిరప సాగులో మనదేశం మొదటిస్దానంలో ఉంది. వర్షాధారంగా సాగుచేసే రైతులు ఎండుమిర్చికోసం సాగుచేస్తుండగా, నీటి వసతి వున్న రైతాంగం, ఆరుతడిపంటగా పచ్చిమిరప సాగుచేసి, చివరి కోతల్లో అవకాశాన్ని బట్టి ఎండుమిరప దిగుబడిని పొందుతున్నారు.
READ ALSO : Mirchi Cultivation : ఏడాది పొడవునా పచ్చిమిర్చి సాగు.. మేలైన యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు
అయితే అధిక శాతం ఎండుమిరప సాగు చేసే రైతులే ఎక్కువగా ఉన్నారు. అయితే సాగు మొత్తం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, పంట పండించిన రైతన్నలు, కోతల సమయంలో తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలి. లేదంటే తాలు అధికంగా వచ్చి, నిల్వలో అఫ్లోటాక్సిన్స్ వల్ల నాణ్యత దెబ్బతినే ప్రమాదం వుంటుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించి, నాణ్యమైన దిగుబడులు పొందాలంటే కోతలు, అనంతరం కాయలు ఆరబెట్టే సమయంలో కూడా శాస్ర్తీయ విధానాలను పాటించాలని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. వీరన్న .