Preventing Pests : శాస్త్రీయ పద్ధతిలో నారుమడులు పెంపకంతో తెగుళ్లకు అడ్డుకట్ట

పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడం పైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. చాలా వరకు రైతులు హైబ్రిడ్‌విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.

Preventing Pests

Preventing Pests : మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో కూడా మార్పులొచ్చాయి. రైతులకు కావాల్సిన విధంగా నార్లు పెంచి ఇచ్చేందుకు నర్సరీలు వచ్చాయి. అయితే  చాలామంది రైతులు  ఇంకా సాధారణ పద్ధతిలోనే కూరగాయల నార్ల పెంపకం చేపడుతున్నారు.

READ ALSO : Rat Damage Control in Paddy : వరిలో ఎలుకలను నివారించే పద్ధతులు

ప్రతికూల వాతావరణ పరిస్థితుల సకాలంలో తగిన నారు దిగుబడి పొందలేకపోతున్నారు. ప్రస్థుతం చాలా ప్రాంతాల్లో కూరగాయ నారుమళ్లలో నారుకుళ్లు తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీని నివారణకు చేపట్టాల్సిన చర్యలు, శాస్త్రీయ పద్ధతిలో నారుమడుల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Export of Mango Slices : మామిడికాయ ముక్కల ఎగుమతితో అధిక లాభాలు ఆర్జిస్తున్న ఎన్టీఆర్ జిల్లా వాసి

పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడం పైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. చాలా వరకు రైతులు హైబ్రిడ్‌విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.  కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. నారుమడిని పెంచే ముందు మనం సాగు చేసే విస్తీర్ణానికి అనుగుణంగా నారుమడిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : Sugarcane Cultivation : ఉత్తర కోస్తాకు అనువైన నూతన చెరకు రకాలు

కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సూజాత నగర్ లో ని రైతులు చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే కూరగాయల నారు పెంచుతున్నారు. శాస్త్రీయ పద్ధతులలో ఎత్తుమడులపై నారు పెంచకపోవటం వల్ల,  అధిక వర్షాలకు నారుకుళ్లు తెగులు ఆశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటు శ్రమ, అటు సమయం వృధా అవుతుంది.

READ ALSO : Stem Borer : వరిలో నష్టం కలిగించే కాండం తొలుచు పురుగు నివారణ మార్గాలు !

ఈ సమస్య నుండి బయట పడాలంటే విత్తనం దగ్గర నుండి నారు విత్తే వరకు పలు యాజమాన్య పద్ధతులు చేపట్టాలని సూచిస్తున్నారు   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యాన శాస్త్రవేత్త డా. బి.శివ. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి శాస్త్రీయ పద్ధతిలో నారు పెంచి సాగు చేస్తే అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది.