Chilli Plantation : మిరప తోటలకు బూడిద తెగులు తంటా – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

Chilli Plantation : ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కోతలు కూడా మొదలయ్యాయి.

Prevention of Chilli Plantation

Chilli Plantation : ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మిరపతోటల్లో బూడిద తెగులు ఉధృతంగా వ్యాపిస్తింది. దీనివల్ల మిరప రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మిరపలో బూడిద తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండో కోతకు సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో దిగుబడికి నష్టం వాటిల్లకుండా రైతులు సత్వర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. జె. హేమంత్ కుమార్.

Read Also : Sugarcane Cultivation Techniques : చెరకు సాగులో మెళకువలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కోతలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా  ఖమ్మం జిల్లాలో దాదాపు 21 వేల హెక్లార్లలో మిర్చి సాగవుతోంది. మొదటి కోత అయిపోయి, రెండోకోతకు సిద్ధంగా ఉంది.

అయితే ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా బూడిద తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. బూడిద తెగులు నివారణ పట్ల రైతులు తగిన శ్రద్ద కనబరిచి తోటలను రక్షించుకోవాలని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. జె.హేమంత్ కుమార్.

బూడిద తెగులు నివారణ :

నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా

కెరాథేన్ 1 మి. లీ లేదా

అజాక్సీస్ట్రోబిన్ 1 మి. లీ

లీటరు నీటికి కలిపి

10 – 15 రోజు వ్యవధిలో

2 సార్లు పిచికారి చేయాలి

Read Also : Mango Farming Cultivation : మామిడి తోటల్లో పూత పురుగును అరికట్టే విధానం