Prevention of Iron Deficiency in Chilli Crop
Chilli Crop : తెలుగు రాష్ర్టాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్యపంట మిరప. చాలా ప్రాంతాల్లో నారు నాట్లకు సిద్దంగా ఉంది. మరి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నాట్లు వేశారు రైతులు. మారుతున్న వాతారణం కారణంగా నారుమడుల్లో ఇనుప ధాతు లోపం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సమస్య నుండి నారును కాపాడుకునేందుకు చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త వనం చైతన్య .
ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే రైతులు, ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, భూములకు అనుగుణంగా రకాలను ఎంచుకుని నార్లు పోసుకున్నారు. కొన్ని చోట్ల ఇప్పుటికే నాట్లు వేయగా మరికోన్ని చోట్ల నాట్లకు సిద్దంగా ఉంది.
అయితే, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అక్కడక్కడ మిరపలో ఇనుప ధాతు లోపం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటు వంటి పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే రైతులు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త వనం చైతన్య.
Read Also : Fruits Plants : క్లోనింగ్ విధానంలో పండ్లమొక్కల ఉత్పత్తి.. ఏడాదికి రూ. 50 లక్షల టర్నోవర్ చేస్తున్న రైతు