Fruits Plants : క్లోనింగ్ విధానంలో పండ్లమొక్కల ఉత్పత్తి.. ఏడాదికి రూ. 50 లక్షల టర్నోవర్ చేస్తున్న రైతు
Fruits Plants : ఏ తోట అభివృద్ది అయినా మంచి జాతిమొక్కల అందుబాటుపైనే ఆధారపడి ఉంటుంది. పంట దిగుబడి, నాణ్యత మొట్ట మొదట లభించే నారు మొక్కలపైనే ఆదారపడి ఉంటాయి.

Cloning Method in Fruits Plants
Fruits Plants : మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల ఎంపిక, సాగు విధానంలో కూడా మార్పులొస్తున్నాయి. ముఖ్యంగా పండ్లతోటల రైతులంతా ఇప్పుడు నర్సిరీలపైనే ఆదారపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే నర్సరీ నిర్వాహకులు ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక విధానంతో మొక్కలను అభివృద్ది పరిచి రైతులకు అందిస్తున్నాయి.
ఇలాంటి నర్సరీలు చాలా మంది రైతులకు ఉపాధి మార్గాలయ్యాయి. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రైతు 10 ఏళ్లుగా రకరకాల పండ్ల మొక్కల నర్సరీలన విజయవంతంగా నిర్వహిస్తూ.. రైతులకు నాణ్యమైన మొక్కలను అందిస్తూ విజయపథంలో పయనిస్తున్నారు.
Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు
ఏ తోట అభివృద్ది అయినా మంచి జాతిమొక్కల అందుబాటుపైనే ఆధారపడి ఉంటుంది. పంట దిగుబడి , నాణ్యత మొట్ట మొదట లభించే నారు మొక్కలపైనే ఆదారపడి ఉంటాయి. ఒక వేళ తొలి సంవత్సరాలలోనే ఏదైనా తప్పు జరిగితే, తరువాతి కాలంలో దానిని సరిదిద్దుకోవడం జరగదు.
తోట యజమానులకు, తోట దిగుబడి, ఆదాయంలో ఎప్పటికీ తేరుకోలేనంత నష్టం జరుగుతుంది. శ్రేష్టమైన విత్తనాలు లభించకపోవడం, ఉత్తమమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం, పండ్లతోటలకు ఆశించినంత దిగుబడిరాక పోవడానికి బలమైన కారణాలు. ఇది దృష్టిలో పెట్టుకోనే పండ్లతోటలను సాగుచేయాలనుకునే రైతులు నర్సరీలపై ఆదారపడుతున్నారు.
ఇందుకు తగ్గట్టుగానే నర్సరీలు వెలిశాయి. కాలానికి అనుగుణంగా, రైతులకు కావల్సిన రకాలను అభివృద్ది చేసి అందిస్తున్నాయి. దీంతో రెండుమూడేండ్లకు రావాల్సిన దిగుబడులు ఏడాదికే వస్తున్నాయి. దీంతో ఇటు రైతులు అటు నర్సరీ యజమానులకు మంచి లాభాలు వస్తున్నాయి.
ఇదిగో ఈ ఈ నర్సరీలో చూడండీ.. జామ కాడలకు ఉన్న ఆకులను కట్ చేస్తున్న మహిళలను. జామ కాడలేంది.. వీరు కత్తెరతో కట్ చేయడమేంది అనుకుంటున్నారా.. అవును మీ డౌట్ నిజమే.. జామ మొక్కల నుండి లేత చిగురు కొమ్మలను కత్తిరించి తీసుకొచ్చి వాటిని క్లోనింగ్ చేసి జామ మొక్కలుగా తయారు చేస్తున్నారు. శ్రీ ఉమామహేశ్వరి నర్సరీ , ప్రూట్ గార్డెన్స్ పేరుతో దీనిని నిర్వహిస్తున్నది మద్దిపాటి సత్యనారాయణ . పది ఏళ్లుగా అనేక రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. అయితే మారుతున్న పంటల సాగువిధానంలో వీరు కూడా మొక్కల పెంపకాన్ని మార్చుకున్నారు.
మార్కెట్ లో తైవాన్ జామ మొక్కలకు డిమాండ్ ఉండటంతో 8 ఏళ్లుగా ఈ మొక్కలను క్లోనింగ్ విధానంలో పెంపకం చేపడుతున్నారు. క్లోనింగ్ అంటే కత్తిరింపు. తల్లి మొక్కల నుండి లేత కొమ్మలు కత్తిరించి వాటిని కోకోపీట్ నింపిన ట్రేలలో నాటుతున్నారు.
వేరువ్యవస్థ బాగా వృద్ధి చెందేందకు హీట్ చాంబర్ లో 40 రోజుల పాటు ఉంచుతారు. తరువాత అక్కడి నుండి 10 రోజుల పాటు షేడ్ నెట్ లలో ఉంచి, ఆ తరువాత 2 నెలల పాటు ఆరుబయటే పెంపకం చేపడుతారు. దీంతో మొక్క ప్రధాన పొలంలో నాటేందుకు తయారవుతుంది. ఇవే కాకుండా.. మామిడి తో పాటు ఇతర పండ్ల మొక్కలు, కొబ్బరి మొక్కలను ఏయిర్ లేరింగ్, అంటుపద్ధతితో ఉత్పత్తి చేస్తున్నారు.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు