Prevention Of Pests : వరిలో చీడపీడల నివారణ, రైతులకు శాస్త్రవేత్తల సూచనలు !

వరి పైర్లు దుబ్బుచేసే దశనుండి అంకురం దశ వరకు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల చీడపీడలు ఆశించడానికి అవకాశం ఉంటుంది. అగ్గితెగులు, కాండంకుళ్లు, జింక్ లోపం, సల్ఫైడ్ వరి పంటకు ఆశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అధికంగా ఎరువులు వాడటం వల్లకూడా అగ్గితెగులు ఆశిస్తుంది.

Prevention Of Pests : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి దుబ్బుచేసే దశనుండి అంకురం దశ వరకు చేరుకుంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా , వరికి వివిధ రకాల చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా అగ్గి తెగులు, కాండం కుళ్లు తెగులు, జింక్ లోపం, సల్ఫైడ్ ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తున్నాయి. వీటిని రైతులు సకాలంలో గుర్తించి, నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది.

READ ALSO : Irrigation Method In Paddy : వరిలో ఆరుతడి నీటి పారుదల పద్ధతితో సాగునీటి ఆదా!

వరి పైర్లు దుబ్బుచేసే దశనుండి అంకురం దశ వరకు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల చీడపీడలు ఆశించడానికి అవకాశం ఉంటుంది. అగ్గితెగులు, కాండంకుళ్లు, జింక్ లోపం, సల్ఫైడ్ వరి పంటకు ఆశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అధికంగా ఎరువులు వాడటం వల్లకూడా అగ్గితెగులు ఆశిస్తుంది.

READ ALSO : Stem Borer : వరిలో నష్టం కలిగించే కాండం తొలుచు పురుగు నివారణ మార్గాలు !

ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలుకండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉదృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకిదశలో వెన్నులో మెడ విరిగి తాలు గింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది..

ఈ చీడపీడల నివారణకు రైతులు చేపట్టాల్సిన యాజమాన్యపద్ధతుల గురించి మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత నాగరాజు తెలియజేశారు. పూర్తి సమాచారం కోసం క్రింది వీడియో లింక్ పై క్లిక్ చేయండి.

ట్రెండింగ్ వార్తలు