Prevention of pests in sesame crop cultivation
Sesame Crop Cultivation : తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వును చెప్పుకోవచ్చు. ఈ పంటకు నీటి అవసరం కూడా తక్కువే. అందుకే మెట్టప్రాంతాల్లో పంటగా నువ్వును సాగుచేస్తుంటారు. రబీ, వేసవి పంటగా డిసెంబర్ 15 ఫిబ్రవరి 15 వరకు విత్తుతుంటారు. అయితే వేసవి నువ్వుకు పలు తెగుళ్ళ బెడద ఉంటుంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తక్కువ సమయంలో, తక్కవ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండింస్తారు. ముఖ్యంగా ఏపిలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగుచేస్తున్నారు.
అయితే రబీ, వేసవిలో సాగుచేసినప్పుడు తెగుళ్ళ బెడద అధికంగా ఉంటుంది. అందుకే విత్తే ముందు నుండే పలు జాగ్రత్తలు తీసుకోవాలని సమగ్ర తెగుళ్ళ సస్యరక్షణ పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు జిగిత్యాల జిల్లా, పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, శాస్త్రవేత్త డా. బలరాం.
Read Also : Leaf Crops Farming : తీగజాతి కూరగాయల సాగుతో.. లాభాలు పొందుతున్న రైతు