Rodent Management : ఎరతెర పద్ధతితో.. వరిలో ఎలుకల నివారణ

గోదావరి జిల్లాల్లో సాగవుతున్న వరి పంటలో ఎలుకల ఉధృతి రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పైరు పొట్టదశనుంచి పంటచేతి కొచ్చే వరకు ఎలుకల బెడద వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటి బెడద ఎక్కువగా ఉన్న పొలాల్లో.. 95 శాతం వరకు  పంట నష్టపోయి రైతులు అసలు కోతలు కొయ్యకుండానే వదిలేసిన సందర్భాలు ఉన్నాయి.

Rodent Management

Rodent Management : తెలుగు రాష్ట్రాల్లో పండించే యాసంగి వరి, ప్రస్తుతం గింజపాలుపోసుకునే దశలో ఉంది.  యితే కాలువల కింద  వరిసాగయ్యే ప్రాంతాల్లో పైరుకు ఎలుకల సమస్య తీవ్రంగా మారింది. . ముఖ్యంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఎలుక‌ల ఉధృతి ఎక్కువ‌గా ఉంది. పైరు చిరుపొట్ట దశనుంచి ఈనిక దశలో వీటివల్ల నష్టం అపారంగా వుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  వీటిని అరిక‌ట్టేందుకు మారుటేరు వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌నాస్థానం శ్రాస్త్ర‌వేత్త‌లు ఎర‌ తెర ప‌ద్ద‌తిని క‌నుగొన్నారు.

READ ALSO : Paddy Cultivation : వరిలో కాండంతొలుచు పురుగు, సుడిదోమ ఉధృతి… నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

గోదావరి జిల్లాల్లో సాగవుతున్న వరి పంటలో ఎలుకల ఉధృతి రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పైరు పొట్టదశనుంచి పంటచేతి కొచ్చే వరకు ఎలుకల బెడద వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటి బెడద ఎక్కువగా ఉన్న పొలాల్లో.. 95 శాతం వరకు  పంట నష్టపోయి రైతులు అసలు కోతలు కొయ్యకుండానే వదిలేసిన సందర్భాలు ఉన్నాయి.

రైతులు నారుమ‌డి పోసి ద‌గ్గ‌ర నుండి ద‌మ్ము చేసుకునేవ‌ర‌కు ఎలుకల నివార‌ణ‌కు గతంలో బుట్ట‌ల‌ను పెట్టే వారు. ఎలుకల ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పంట కాలంలో ఒక్కోసారి జింకు ఫాస్ఫైడ్ ఎర, బొరియల్లో అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్లలను వేసి కప్పేవారు. పంట ఏ దశలోనైనా ఎలుక కన్నాలలో పొగను “బర్రో ప్యూమిగేటర్”  ద్వారా వదిలి చంపేవారు.

READ ALSO : Watermelon Cultivation : ఎల్లో రకం పుచ్చసాగు.. ఎకరాకు రూ. 2 లక్షల నికర ఆదాయం

ఇప్పుడు అనేక చ‌ర్య‌లు చేప‌ట్టినా.. వాటిని అరిక‌ట్ట‌లేక పోతున్నారు. ఈ నేపధ్యంలో మారుటేరు వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌నా స్థానంలో ఎలుక‌ల నివార‌ణ‌కు ఎర తెర ప‌ద్ద‌తిని  క‌నుగొన్నారు. ఈ విధానం పట్లు రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు శాస్త్ర‌వేత్త‌లు. మొత్తం మీద వ‌రిలో ఎలుక‌ల నివార‌ణ‌కు మ‌రో ప‌ద్ద‌తిని శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు. క్షేత్ర‌స్థాయిలో ఈ ప‌ద్ద‌తిపై రైతుల‌ు అవగాహన పెంచుకుంటే ఎలుకలను సమర్ధంగా అరికట్టేవచ్చు.