Prevention of Withefly on Guava Trees
Guava Trees : రెండు మూడేళ్లుగా జామ పండ్లకు డిమాండ్ పెరగడంతో , ఇటీవల కాలంలో వీటి విస్తీర్ణం పెరిగింది. చాలా వరకు రైతుల మార్కెట్ లో డిమాండ్ ఉన్న తైవాన్ జామ రకాన్ని సాగుచేశారు. ప్రస్తుతం కొత్తగా పెట్టిన తోటల్లో చిగుర్లు వచ్చే సమయంలో పిండినల్లి, పేనుబంక ఆశించి లేత తోటలకు నష్టం చేస్తున్నాయి. వీటి నివారణకు తొలిదశనుండే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ వెంకటరెడ్డి.
పేదవాడి యాపిల్‌గా పిలిచే జామకు నానాటికీ గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు. ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామపండ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వీటికి మంచి డిమాండ్‌ఉండటంతో రైతులు పలు జామ రకాలను సాగుచేసి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు . సాగులో అందివస్తున్న నూతన శాస్త్రపరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలను చవిచూస్తున్నారు .
ముఖ్యంగా జామ ఏడాదికి మూడు పంటలు వస్తుండటంతో చాలా మంది రైతులు సాగుచూస్తున్నారు. ఇటీవల కొత్తగా పెట్టిన లేత తోటలల్లో పేనుబంక, పించి నల్లి ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల తోటలకు తీవ్రనష్టం కలిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పేనుబంకకంటే కూడా పిండినల్లి చాలా ప్రమాదకరమని చెప్పవచ్చు. ఒక సారి ఆశించినట్లైతే నివారించడం చాలా కష్టతరమైన పని. కాబట్టి రైతులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తొలి దశనుండే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చని తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ వెంకటరెడ్డి.
పిండినల్లి ఒక్క జామా మొక్కల పైనే కాకుండా కలుపు మొక్కలపైన కూడా కనిపిస్తుంటుంది. ఇది ఆశించినట్లు రైతులు గుర్తించినట్లైతే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. కేవలం పురుగు మందులతో ఈ పురుగును నివారించలేము. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారానే దీనిని సమూలంగా నివారించవచ్చు. మరోవైపు పేను బంక ఆశించిన తోటల్లో పెరుగుదల ఆగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు . సకాలంతో సస్యరక్షణ చర్యలు చేపడితే నివారించవచ్చు .
జామలో పిండినల్లి, పేనుబంక ఆశించినప్పుడు గండు చీమలు కూడా తిరగడం జరుగుతుంది . ఈ చీమలు ద్వారా పిండినల్లిని ఒక కొమ్మనుండి మరో కొమ్మకు , ఒక మొక్క నుండి మరో మొక్కకు వ్యాప్తి చేయడానికి దొహదపడుతుంటాయి. కాబట్టి చీమల బెడద లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చీమల పుట్టలు , పాదులలో ఉన్నా క్లోరిపైరిపాస్ చల్లుకోవాలి.
Read Also : Sunflower Crop : రబీకి అనువైన ప్రొద్దుతిరుగుడు రకాలు – అధిక దిగుబడులకు సాగులో మేలైన యాజమాన్యం