Chilies Pest : మిర్చి తోటలను తామర పురుగులు తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. పూత, కాయ దశలో ఈ పురుగులు ఆశించడంతో, కాయగా మారకుండగానే పూత రాలిపోతుంది. ఎన్ని మందులు పిచికారి చేసినా లాభం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే నివారించవచ్చని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు.
ఎన్నో ఆశలతో సాగుచేసుకున్న మిర్చి పంట .. ఇప్పుడు కన్నీరు తెప్పిస్తోంది. పూత, కాత సమయంలో తామర పురుగులు ఆశించి తీవ్ర నష్టంచేస్తున్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతుల ఆశలు, నిలువునా నేల రాలిపోతున్నాయి. సాధారణంగా మిరప పంటలో తామర పురుగులు అన్ని దశల్లోనూ ఆశిస్తుంటాయి. వీటిపి నివారించడానికి రైతు స్పైనోసాడ్, ఫిప్రోనిల్ ,డయూఫెన్ థయూరాన్ లాంటి మందులను పిచికారి చేసి నివారించడం జరుగుతోంది.
అయితే ఈ కొత్త రకం తామర పురుగులు, వాటికి భిన్నంగా ముదురు నలుపు రంగులో వుండి.. ఎలాంటి పురుగు మందులకు లొంగకుండా.. విపరీతంగా పూతను ఆశించి నష్టపరుస్తుండటం వలన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా , జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.
Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్లో వరిగట్లపై కూరగాయల సాగు