Marigold Flower
Marigold Flower Cultivation : ఎప్పుడూ మూస పంటలైన వరి, మిర్చి, మొక్కజొన్న పంటలు సాగుచేస్తున్న రైతులకు లాభనష్టాలమాట పరిపాటిగా మారింది. పదేపదే వేసిన పంటలే వేయటం వల్ల సాగులో ఇబ్బందులు తప్పటం లేదు. కొన్నిసార్లు పెట్టుబడి కూడా రాక వ్యవసాయం వదిలేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు, బంతిపూల సాగుచేపట్టి మంచి దిగుబడులను సాధిస్తున్నారు.
READ ALSO : Anti Aging Foods : వృద్ధాప్య ప్రభావం మీ మెదడుపై పడకుండా ఆరోగ్యంగా ఉంచడానికి 5 ఆహారాలు !
వాణిజ్యపరంగా సాగుచేసే పూలలో బంతి ముఖ్యమైనది. పండుగలు, శుభకార్యాల సమయంలో వీటికి మంచి గిరాకీ ఉంటుంది. బంతిపూల పంటకాలం 120రోజులు కాగా, నాటిన 55 నుండి 60 రోజుల నుంచే దిగుబడి మొదలవుతుంది. అంతేకాకుండా, వీటిని ఏడాది పొడవునా సాగుచేసే అవకాశం ఉన్నది. అందుకే.. ఏయేటి కాయేడు బంతి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది.
READ ALSO : Soybean Cultivation : సోయాబీన్ సాగులో చీడపీడలు సస్యరక్షణ చర్యలు!
తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నది. రైతన్న ఇంటికి లాభాల పూలబాట వేస్తున్నది. అందుకే చాలా మంది రైతులు బంతిసాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం మండలం, చిన్నతాడేపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకటనారాయణ ఎకరం పొలంలో రెండు రకాల బంతి నాటారు. మార్కెట్ లో కూడా ధర బాగుండటంతో మంచి లాభాలు వస్తున్నాయంటున్నారు.