Pulses Cultivation : వేసవి అపరాల సాగులో మెళకువలు – అధిక దిగుబడులకు చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం  

Pulses Cultivation : సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని, సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 7 నుండి 8 క్వింటాళ్ళ వరకు దిగుబడులు పొందవచ్చు.

Pulses Cultivation in Summer : తక్కువ పెట్టుబడులతో, స్వల్పకాలంలో అందివచ్చే అపరాలసాగు రైతుకు అన్ని విధాలా కలసివస్తోంది. సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని, సమయానుకూలంగా  యాజమాన్య పద్ధతులు  పాటించినట్లయితే ఎకరాకు 7 నుండి 8 క్వింటాళ్ళ వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్థుతం  వేసవి పంటగా అపరాలు సాగుచేసే రైతులు  పైరులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు  శాస్ర్తవేత్త డా శ్రీధర్.

Read Also : Rabi Sesame Cultivation : రబీ నువ్వు సాగు యాజమాన్యం.. అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు

మన దేశం అపరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, అంత కన్నా ఎక్కువ స్థాయిలో పప్పుధాన్యాల వినియోగం ఉంది. దీని వల్ల గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో డిమాండ్ – సరఫరా మధ్య వ్యత్యాసం పెరుగుతూ వచ్చింది. కానీ దేశీయ అవసరాలు తీర్చడానికి విదేశీ దిగుమతులపై ఆధారపడడం తప్పకపోవడం వల్ల ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు నష్టపోవడం జరుగుతూ ఉంది. అందుకని దేశీయంగానే ఉత్పత్తిని పెంచి, వాణిజ్య పరంగానే కాకుండా, ఆహార భద్రతను ముఖ్యంగా పోషకాహార భద్రతను సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది.

అధిక దిగుబడినిచ్చే పలు రకాలు : 
నీటి వసతి వున్న రైతాంగం ప్రస్థుతం వేసవి పంటగా మినుము, పెసర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.  ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను  ఎంపికచేసుకొని ఫిబ్రవరి చివరి వరకు ఈ పంటలను విత్తుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మార్చి 15 వరకు కూడా విత్తుకోవచ్చు. పెసర, మినుము పైర్లలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చు.

అపరాల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా వుంటాయి. కానీ చౌడునేలలు, మురుగునీరు నిలిచే భూములు పనికిరావు. వేసవి అపరాల్లో ముఖ్యంగా విత్తన మోతాదు, సాళ్ల మధ్య దూరం జాగ్రత్తగా పాటించాలి. అంతే కాకుండా విత్తన శుద్ధి చేయడం వలన విత్తిన 30 రోజుల వరకు పంటను చీడపీడల బారినుండి కాపాడినవాళ్లమవుతాము. అపరాల సాగులో అతిముఖ్యమైంది ఎరువుల యాజమాన్యం. ఎంచుకున్న నేలను ముందుగా 2,3సార్లు బాగా దున్ని, ఆఖరిదుక్కిలో 2 టన్నుల పశువుల ఎరువును వేసుకుని కలియదున్నుకోవాలి.  దాంతో పాటు  నత్రజని, భాస్వరానిచ్చే  ఎరువులను వేసుకోవాలి.

Read Also : Sugarcane Farmers : చెరకు సాగు పెంచేందుకు కేసీపీ చర్యలు – రైతులకు సబ్సిడీలు అందిస్తున్న యాజమాన్యం

ట్రెండింగ్ వార్తలు