Sugarcane Farmers : చెరకు సాగు పెంచేందుకు కేసీపీ చర్యలు – రైతులకు సబ్సిడీలు అందిస్తున్న యాజమాన్యం

Sugarcane Farmers : పంచదార పరిశ్రమ సంక్షోభంలో ఉండటంతో పంచదారకు గిట్టుబాటు ధర ఇవ్వలేక చక్కెర కర్మాగారాలు మూతపడుతున్నాయి. మరో వైపు రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో జాప్యం జరుగుతోంది.

Sugarcane Farmers : చెరకు సాగు పెంచేందుకు కేసీపీ చర్యలు – రైతులకు సబ్సిడీలు అందిస్తున్న యాజమాన్యం

Sugarcane Farmers

Sugarcane Farmers : దేశ వ్యాప్తంగా సాగయ్యే ముఖ్య వాణిజ్య పంటలో ఒకటి చెరుకు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా పెరుగుతున్న విత్తనం, పురుగుమందులు కూలీల ఖర్చులు రైతులకు ఆర్థిక భారంగా మారుతోంది. దీనికి తోడు గిట్టుబాటు ధర రావడంలేదు. దీంతో సాగుకు అసాంతం తగ్గుతూ వస్తోంది. అయితే ఏపిలోని కృష్ణా జిల్లా కేసిపి షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో సాగు విస్తీర్ణం పెంచేందుకు యాజమాన్యం రైతులకు పలు ప్రోత్సాహకాలను అందిస్తోంది.

Read Also : Ragi Cultivation : రాగిలో ఎరువులు, చీడపీడల నివారణ.. సమగ్ర యాజమాన్య పద్ధతులు

కూలీల కొరత, గిట్టుబాటు కాని ధరలతో చెరకు సాగు విస్తీర్ణం ఏఏటికాయేడు తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో గతంలో 16 వేల ఎకరాల్లో మొక్క, 9 వేల ఎకరాల్లో పిలక తోటలు సాగు చేసి 8 లక్షల టన్నుల చెరకును పండించేవారు. ప్రస్తుతం 7 వేల ఎకరాల్లో మొక్క, 5 వేల ఎకరాల్లో పిలక తోటలు సాగు చేస్తూ 4.5 లక్షల టన్నుల చెరకును కర్మాగారానికి తోలుతున్నారు.

చెరకు సాగు పెంచేందుకు కేసిపి చర్యలు : 
దాదాపు 50 శాతానికి పైగా సాగు విస్తీర్ణం పడిపోయింది. పంచదార పరిశ్రమ సంక్షోభంలో ఉండటంతో పంచదారకు గిట్టుబాటు ధర ఇవ్వలేక చక్కెర కర్మాగారాలు మూతపడుతున్నాయి. మరో వైపు రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో జాప్యం జరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉయ్యూరు కేసీపీ యాజమాన్యం రైతులకు చెరకు పంట అదనంగా బోనస్ తో పాటు దిగుబడులు పెంచేందుకు తగిన చర్యలు చేపట్టింది.

2022-23 సీజన్‌కు టన్ను చెరకు మద్దతు ధర రూ.3465గా ప్రకటించింది. ఇతర ప్రోత్సాహకాల్లో భాగంగా కొత్తగా చెరకు వేసే పక్షంలో ఎకరానికి మొక్క పైరుకు రూ.25 వేలు, పిలకకు రూ.8వేలు యాజమాన్యం అడ్వాన్సుగా చెల్లిస్తుంది. అంతే కాదు కొత్తగా తోటలు నాటే వారికి యాంత్రీకరణ అందుబాటులోకి తీసుకొచ్చింది. చక్కెర పరిశ్రమ భారతదేశంలో రెండవ అతిపెద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమ.

ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర పరిశ్రమతో పాటు చెరుకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం చక్కెర తయారీకి ముడి పదార్థం అయిన చెరుకు సాగు వ్యయం ఒక్క ఎకరాకు లక్ష రూపాయలు దాటిపోవడం, చక్కెర తయారీ ఖర్చు కన్నా అమ్మకపు ధర తక్కువ ఉండటం. ఇటు ప్రభుత్వాల నుండి ప్రొత్సాహకాలు తగ్గడంతో రైతులు సాగుకు దూరమవుతున్నారు. అయితే కేసిపి యాజమాన్యం అందిస్తున్న సబ్సిడీలతో చెరకు సాగు కొంత ఆశాజనకంగా ఉందంటున్నారు రైతులు.

Read Also : Rabi Sesame Cultivation : రబీ నువ్వు సాగు యాజమాన్యం.. అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు