Cashew Nuts Price Reduced
Cashew Nuts Price : జీడిపప్పు పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది పలాస. ఈ ప్రాంతంలో మాత్రమే జీడిగింజల ప్రాసెసింగ్ కంపెనీలు ఉండటంతో దీనికి అంత ప్రత్యేకత. అంతే కాదు రుచి, నాణ్యతలో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వ్యాపారులకు అధిక లాభాలను తెచ్చిపెడుతోన్న జీడిపప్పు… వీటిని పండించే గిరిజన రైతులకు మాత్రం చేదును మిగుల్చుతోంది. ప్రభుత్వ మద్దతు ధర లేకపోవడం, దళారుల దోడిపీతో పాటు చీడిపీడలు, ప్రక్రతివైపరీత్యాలతో జీడి రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
READ ALSO : Summer Cultivable Vegetables : వేసవిలో సాగుచేయాల్సిన కూరగాయ పంటలు.. అధిక దిగబడికోసం శాస్త్రవేత్తల సూచనలు
పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో.. గిరిజనులు దశాబ్ధాలుగా జీడి తోటల సాగును ప్రధాన వ్రత్తిగా కొనసాగిస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వాలు ఐటిడిఏ ద్వారా జీడితోటల పెంపకానికి అనేక ప్రోత్సాహాకాలు అందిస్తున్నాయి. అయితే జీడి పంటకు మద్దతు ధర ఇవ్వడంలో మాత్రం విఫలమవుతున్నాయి. జీడి పంటను కొనుగోలు చేయడంలో అటు గిరిజన సహకార సంస్థ గాని, ఇటు రైతు భరోసా కేంద్రాలు గాని ముందుకు రావడం లేదు.
READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు
దీనిని అవకాశంగా తీసుకుని స్థానిక వ్యాపారులు సిండికేట్ గా మారి, గిరిజనుల శ్రమను దోచుకుంటున్నారు. వారు చెప్పిందే ధరగా గిరిజనుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో జీడిపిక్కలు 120 రూపాయల వరకు ధర పలుకుతుండగా, దళారులు మాత్రం వంద రూపాయల లోపే ధర చెల్లిస్తున్నారు. ఒక పక్క దిగుబడులు తగ్గడం.. మరోవైపు ధర లేకపోవడంతో తాము నష్టాలను చవిచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!
జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉండటంతో పాటు జీడి తోటల సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అందుకే అధికంగా ఇక్కడ జీడితోటలు సాగవుతున్నాయి. అయితే ఇక్కడి రైతులు కేవలం పంట దిగుబడి మాత్రమే తీసుకుంటే .. తోటల నిర్వాహణను గాలికి వదిలేయడంతో ఏఏటికాయేడు దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి. మరోవైపు సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో వచ్చిన దిగుబడులకు ధర పలకడంలేదు. నాణ్యమైన దిగుబడి, గిట్టుబాటు ధర రైతు పొందాలంటే ఏలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో సూచిస్తున్నారు జిల్లా ఉద్యాన అధికారి సత్యనారాయణ రెడ్డి.