Sesame Cultivation : తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన నువ్వు సాగు విస్తీర్ణం.. అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం

Sesame Cultivation : నూనె గింజల సాగు వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుంది. అందులో నువ్వుల నూనెకు ఎక్కువ డిమాండ్‌ఉంటుంది.

Sesame Cultivation Process In Summer

Sesame Cultivation : నీటి వసతి వున్న రైతాంగం వేసవి పంటగా నువ్వుసాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. యాసంగిలో సమస్యలు తక్కువగా వుండి దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..

అయితే రైతు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి వుంటుంది.వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువలు గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృష్టి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత డి. శ్రీనివాస్ రెడ్డి.

నూనె గింజల సాగు వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుంది. అందులో నువ్వుల నూనెకు ఎక్కువ డిమాండ్‌ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో రైతులు నువ్వుల పంటను అధికంగా సాగు చేస్తుంటారు. నువ్వుల పంట కాలం 90 రోజులు మాత్రమే.

ఫిబ్రవరి వరకు విత్తుకునేందుకు అనుకూల సమయం. అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో, నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్‌లో వర్షాధారంగా పండించిన దానికంటే వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం యాసంగిలో చాలామంది రైతులు నువ్వుల సాగు చేపట్టారు. కొంత మంది వేసేందుకు సిద్దమవుతున్నారు. అయితే సాగు మొదటి దశలో వేరుకుళ్లు, కాండంకుళ్లు లాంటి తెగుళ్ల వ్యాప్తి అధికంగా ఉంటుంది.

వీటిని రైతులు గుర్తించి, సమయానుకూలంగ సమగ్ర సస్యరక్షణ చేపటితే అధిక దిగుబడులు పొందవచ్చని సూచిస్తున్నారు, కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృష్టి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత  డి. శ్రీనివాస్ రెడ్డి.

Read Also : Sustainable Agriculture : స్టార్టప్‌లతోనే సుస్థిర వ్యవసాయం