Rare Fishes Farming : అరుదైన చేపలను పెంచుతున్న యువకుడు.. సొంతంగా ఫాం పెట్టుకుని స్వయం ఉపాధిపై శిక్షణ ఇస్తూ..!

Rare Fishes Farming : ప్రపంచంలో అంతరించిపోతున్న చేపజాతులను ఉత్పత్తి చేస్తూ, మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ చేపజాతుల పట్ల స్వయం ఉపాధి కోసం శిక్షణ కూడా ఇస్తున్నాడు ఈ యువకుడు.

Shanmukha Sainath Who farming fishes

Rare Fishes Farming : క‌ల‌ క‌నాలంటే దైర్యం కావాలి. క‌ల రూపం దాల్చాలంటే దాన్ని నిజం చేసుకునే నిబ‌ద్ద‌త ఉండాలి. ఎన్ని అవ‌రోదాలు ఎదురైనా అధిగ‌మించ‌గ‌లిగే ఆత్మ‌విశ్వాసం చూపాలి. ఏకాల‌మైనా, ఏరంగ‌మైనా స‌రే.. ఏదోచేయాల‌న్న త‌ప‌నే ఆ వ్య‌వ‌స్త‌ను ముందుకు తీసుకెళుతుంది. ఇలా ముందుకు తీసుకపోతున్నవాళ్ళలో ఒకరు శణ్ముఖ సాయినాథ్. ఇంతకీ ఆయన ఎంచుకున్న రంగమేంటీ..? చేస్తున్న పని ఏంటో.. తెలియాలంటే ఈ స్టోరీ తప్పకుండా చూడాల్సిందే..

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..

ఇంగ్లీష్ లో  వేర్ దేర్ ఈజ్ దా విల్ .. దేర్ ఈజ్ ఏ వే అని ఒక సామేత ఉంది. అంటే సంక‌ల్పం దృఢంగా ఉంటే మార్గాలు వాటంత‌ట అవే  తెరుచుకుంటాయి అని అర్ధం. అలాంటి మార్గాలను తన బలమైన సంకల్పంతో వేసుకున్నారు  రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ మండలం , అన్నారం గ్రామానికి చెందిన యువకుడు శణ్ముఖ సాయినాథ్.

శణ్ముఖ సాయి చదివింది ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ . కొన్నాళ్లపాటు నేషనల్ ఫిషరీస్ బోర్డులో ఉద్యోగం చేశారు. అయితే తను మత్స్యకార కుటుంబానికి చెందడం.. ఇటు చదువు.. ఉద్యోగంలో ఉన్న అనుభవంతో  సొంతంగా ఫాం పెట్టుకోవని , తనతో పాటు మరి కొంతందికి ఉపాధి కల్పించాలనుకున్నారు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ మండలం , అన్నారం గ్రామంలో తన 10 ఎకరాల వ్యవసాయం భూమిలో  కొరమేను చేపల పెంపకం, కొరమేను పిల్లల ఉత్పత్తి చేస్తున్నారు.

ఇందుకోసం మూడు పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు. పిల్లల బ్రీడింగ్ కోసం చిన్న చిన్న గుంటలను తవ్వి కొర్రమేను పిల్లల ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తి అయిన పిల్లలను రేరింగ్ యూనిట్స్ లలో పెంచుతున్నారు. ఆ పిల్లను రైతులకు అమ్ముతూ… అవి మార్కెట్ కు వచ్చే వరకు వారికి అందుబాటులో ఉంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు నేషనల్ ఫిషరీస్ బోర్డు తో అనుసందానమై ప్రపంచంలో అంతరించిపోతున్న చేపజాతులు.. అలంకరణ చేపల ఉత్పత్తిని చేపడుతున్నారు. మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ చేపజాతుల పట్ల పలువురికి శిక్షణ కూడా ఇస్తున్నారు.

మారుతున్న కాలానుగుణంగా శాస్త్రీయ బద్ధంగా చేపల ఉత్పత్తి చేస్తూనే… అనుబంధ రంగాలను ఎన్నుకొని సమీకృత వ్యవసాయాన్ని చేస్తున్నారు సాయినాథ్. దేశీ వరిరకాల సాగుతో పాటు పండ్ల తోటలు, కూరగాయలు సాగుచేస్తూనే… నాటు కోళ్ళు, బాతులు, దేశీ ఆవులు, మేకల పెంపకం చేపడుతున్నారు. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు, వ్వర్ధాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడుతాయి.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ఒకవైపు చేపపిల్లల ఉత్పత్తిని చేస్తూనే.. మరోవైపు  మిశ్రమ వ్యవసాయం చేపట్టారు సాయినాథ్. కొత్తగా చేప పిల్లలు పెంచాలనుకునే వారికి… ఉత్పత్తితో వచ్చే లాభాలు వంటి అంశాలపై అవగాహణ కల్పిస్తూ.. స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకునే విధంగా శిక్షణ ఇస్తున్నారు.. భవిష్యత్తులో ప్రపంచంలో అంతరించిపోతున్న ముఖ్యమైన చేపపిల్లల ఉత్పత్తిని భారీ ఎత్తున చేపట్టనున్నట్లు కార్యచరణ రూపొందించుకుంటున్నారు.