Sigatoka and Panama Pests in Banana
Panama Pests in Banana : అరటి సాగయ్యే అన్ని ప్రాంతాల్లోను రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య సిగటోక ఆకుమచ్చ తెగులు. మొక్క దశనుండి గెలకోత వరకు ఈ తెగులు బెడద వెంటాడుతోంది. వీటితోపాటు తరచూ దుంపకుళ్లు, పనామా తెగుళ్లు దాడితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి శాస్త్రవేత్త డా. నాగలక్ష్మి రైతాంగానికి తెలియజేస్తున్నారు.
Read Also : Nursery Cultivation : ప్రో ట్రేలలో నారు పెంపకంతో ఉపయోగాలు.. సమయం, డబ్బు ఆదా
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పండ్లతోటల్లో అరటి ప్రధానమైంది. ఒకసారి నాటితే 3 సంవత్సరాల వరకు రైతులు గెల దిగుబడి తీస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా తోటల్లో చీడపీడల బెడద ఎక్కువవటంతో రైతులు ఒకటి రెండు పంటలకే తోటలను తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రధానంగా సిగటోక ఆకుమచ్చ, పనామా, దుంపకుళ్లు వంటి సమస్యలు తోటలను వెన్నాడుతున్నాయి. అధిక సాంద్ర పధ్దతిలో మొక్కలు నాటిన తోటల్లో ఈ సమస్య తీవ్రత మరింత ఎక్కువగా వుంది. తోటల్లో కలుపు లేకుండా చూసుకుని, తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ తెగుళ్లను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డా. నాగలక్ష్మి.
అరటి తోటలను ఆశించే తెగుళ్లలో అతి ప్రమాధకరమైన తెగుళ్లు పనామా, దుంపకుళ్లు తెగుళ్లు. బాక్టీరియా, శిలీంధ్రాల ద్వారా ఆశించే ఈ తెగుళ్ల వల్ల ఒక్కోసారి పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Read Also : Silkworms Farming : పట్టుసాగుతో లాభాలు ఆర్జిస్తున్న రైతు.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు