Silkworms Farming : పట్టుసాగుతో లాభాలు ఆర్జిస్తున్న రైతు.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు

Silkworms Farming : 20 ఏళ్లక్రితం సాగుచేసిన పంటల్లో తీవ్ర నష్టాలను చవిచూసిన రైతు, ప్రస్తుతం అదే పంటసాగుచేసి లాభాలు పొందుతున్నాడు.

Silkworms Farming : పట్టుసాగుతో లాభాలు ఆర్జిస్తున్న రైతు.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు

Silkworms Farming

Silkworms Farming : ఓర్పు, సహనం.. కృషి ఉండాలే గాని నష్టపోయిన చోటే , లాభాలను పొందవచ్చని నిరూపిస్తున్నారు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు. 20 ఏళ్ల క్రితం పట్టుపురుగుల పెంపకం చేపట్టి నష్టపోయిన రైతు.. ప్రస్తుతం అదే పంటను చేపట్టి మంచి లాభాలను పొందుతున్నారు.. ప్రభుత్వం పంట మార్పిడి చేయాలనడం.. మార్కెట్ లో కూడా పట్టుగూళ్లకు మంచి ధర పలుకుతుండటంతో, ప్రభుత్వ ఉద్యోగి మాదిరి నెల నెలా జీతంలా సంపాధిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read Also : Bitter Gourd Cultivation : కాసుల కాకర సాగు.. అధిక లాభాలు పొందుతున్న నెల్లూరు జిల్లా రైతు

నాడు దండగైన పంటే.. నేడు పండుగయ్యింది. 20 ఏళ్లక్రితం సాగుచేసిన పంటల్లో తీవ్ర నష్టాలను చవిచూసిన రైతు, ప్రస్తుతం అదే పంటసాగుచేసి లాభాలు పొందుతున్నాడు. అతనే భూమారెడ్డి. నిర్మల్ జిల్లా, కడెం మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన ఈయన గతంలో మల్బరి సాగు చేసేవారు. అయితే మార్కెట్ లో పట్టుగూళ్లకు ధర లు లేకపోవడం.. వైరస్ లు అధికంగా రావడంతో తీవ్రనష్టాలను చవిచూశారు. దీంతో మల్బరి సాగును వదిలేసి సంప్రదాయ పంటలను సాగుచేయడం మొదలు పెట్టారు.

అయితే వీటిలో కూడా అనుకున్నంత లాభాలు రాకపోవడంతో పంట మార్పిడి చేయాలనుకున్నారు. ఏ పంట వేయాలో పాలుపోలేదు. ఆఖరికి తెలిసిన పంట అయిన మల్బరిసాగు  చేపట్టాలనుకున్నారు. మార్కెట్ లో పట్టుపురుగుల గూళ్లకు మంచి ధర పలుకుతుండటం, ఇటు ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తుండటంతో 2 ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టాడు రైతు. ఏడాదికి ఏడు, ఎనిమిది పంటలు తీస్తూ నెలనెల ప్రభుత్వ ఉద్యోగిలాగా మంచి జీతం పొందుతున్నాడు.

అంతర్జాతీయంగా పట్టుకు మంచి డిమాండ్ ఉంది. ఇతర పంటలతో పోల్చితే మల్బరి సాగులో తక్కువ పెట్టుబడి,  రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. పంట కూడా 20 రోజులకే వస్తుండటంతో ఇతర పంటలతో పోల్చితే మంచి లాభసాటిగా ఉంది. పరిస్థితులు అనుకూలించకపోతే.. ఒక పంట రాకపోయినా.. పెద్దగా నష్టాలు ఉండవు. అంతే కాదు మొక్క మొదలు, షెడ్ నిర్మాణం, పట్టుగూళ్ల కు ఇన్సెటీవ్ లు ఇస్తుండటంతో రైతులు ఈ పంటపట్ల ఆసక్తి చూపుతున్నారు.

Read Also : Cucumbar Cultivation : బోరాన్ లోపంతో తగ్గుతున్న దోస దిగుబడులు – నివారణ చర్యలు