Cucumbar Cultivation : బోరాన్ లోపంతో తగ్గుతున్న దోస దిగుబడులు – నివారణ చర్యలు

Cucumbar Cultivation : ఈ పంటకు అనేక రకాల పోషకాల సమస్యలు ఉన్నప్పటికీ అధికంగా బోరాన్ లోపం పంట దిగుబడులపై  తీవ్ర ప్రభావం చూపుతుంది.

Cucumbar Cultivation : బోరాన్ లోపంతో తగ్గుతున్న దోస దిగుబడులు – నివారణ చర్యలు

Cucumbar Cultivation

Updated On : April 4, 2024 / 3:58 PM IST

Cucumbar Cultivation : తెలుగు రాష్ట్రాల్లో కూరగాయ పంటలు విస్తీరంగా సాగుచేస్తుంటారు. ముఖ్యగా తీగజాతి పంటైన కూరదోస మంచి ప్రాచూర్యం పొందిన పంట. ఈ పంటకు అనేక రకాల పోషకాల సమస్యలు ఉన్నప్పటికీ అధికంగా బోరాన్ లోపం పంట దిగుబడులపై  తీవ్ర ప్రభావం చూపుతుంది.

ప్రస్తుతం పూత ,  పిందె దశలలో ఉన్న ఈ పంటకు బోరాన్ లోపం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇది గుర్తించిన వెంటనే రైతులు సరైన యాజమాన్యం చేపడితే బోరాన్ లోపాన్ని నివారించి నాణ్యమైన అధిక దిగుబడులను సాధించేందుకు ఆస్కారముందంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. రాంప్రసాద్.

ప్రపంచ దేశాలలో ఎంతో ఆరోగ్యవంతమైనదిగా కొనియాడబడుతున్న దోస, వేసవిలోనే కాకుండా అన్ని కాలాల్లో సాగుచేస్తున్నారు రైతులు. కేవలం ఒక ప్రత్యేక నేల అని కాకుండా ఎటువంటి నేలలోనైనా విరివిగా పెరుగుతుంది. అతితక్కువ సమయంలో చేతికి వచ్చే ఈ పంటకు పోషకాల లోపం చాలా వరకు ఉంటుంది.  రైతులు రసాయన ఎరువులను మాత్రమే అందిస్తూ ,సూక్ష్మపోషకాలను నిర్లక్ష్యం చేస్తుంటారు.

దీంతో పోషకాల లోపం ఏర్పడుతుంది.  ముఖ్యంగా బోరాన్ లోపం తో  పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాయలు  పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దోస మొలకెత్తిన తరువాత తీగలు 4 నుండి 5  ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే రైతులు జాగ్రత్త పడి నివారణ చర్యలు చేపట్టాలంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. రాంప్రసాద్.

దోసలో  సమగ్ర ఎరువుల యాజమాన్య చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చు. ఎకరాకు రెండున్నర కిలోల యూరియా, రెండు కిలోల పొటాష్ ఎరువులను 15 విడుతలుగా 45 రోజుల వరకు వేస్తుండాలి. ఆ తరువాత 2 కిలోల యూరియా, 3 కిలోల పొటాష్ ఎరువును నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా అందించాలి. పూత, పిందె ప్రారంభమైన తరువాత మల్టికె-10 లేదా 0.5 మిల్లీ లీటర్ల స్కోర్‌ను లీటరు నీటికి కలిపి 2-3 సార్లు పిచికారీ చేస్తే నాణ్యమైన మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.

Read Also : Bitter Gourd Cultivation : కాసుల కాకర సాగు.. అధిక లాభాలు పొందుతున్న నెల్లూరు జిల్లా రైతు