Sorghum Aphid Fly Prevention : జొన్నలో మొవ్వు తొలుచు ఈగ నివారణ చర్యలు

Sorghum Aphid Fly Prevention : జొన్నఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 17-18 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక  రకాలు రైతులకు అందుబాటులో ఉండటంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు.

Sorghum Aphid Fly Prevention

Sorghum Aphid Fly Prevention : రబీ ఆరుతడి పంటల్లో జొన్న ముఖ్యమైనది. ఆహార పంటగానే కాక, పశువులకు మేతగా, కోళ్లకు దాణాగా వినియోగిన్నారు. సాధారణంగా సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు విత్తుతారు. అయితే ఆలస్యంగా విత్తిన ప్రాంతాల్లో మొవ్వు తొలుచు ఈగ ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి  రైతులకు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. రాం ప్రసాద్.

Read Also : Pests in Chilli Cultivation : మిరప తోటల్లో పురుగులు, తెగుళ్ల ఉధృతి.. చీడపీడల నివారణ

లేత జొన్న తోటల్లో మొవ్వుతొలుచు ఈగల బెడద : 
ఒకప్పుడు జొన్నసాగు అధిక విస్తీర్ణంలో సాగయ్యేది. రాను రాను వ్యవసాయంలో వ్యాపార దృక్పధం పెరగటం, తక్కువ దిగుబడులవల్ల సాగు గిట్టుబాటుకాకపోవటం వల్ల రైతులు  జొన్న పంటకు దూరమవుతూ వచ్చారు. కానీ  ప్రస్తుతం పరిస్థితులు మారాయి. జొన్నఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 17-18 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక  రకాలు రైతులకు అందుబాటులో ఉండటంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు.

ముఖ్యంగా  రాయసీమ, తెలంగాణ ప్రాంతాల్లో రబీలో ఆరుతడి పంటగా అధిక విస్తీర్ణంలో సాగు అవుతోంది.  అయితే ఆలస్యంగా వేసిన ప్రాంతాల్లో మొవ్వు తొలుచు ఈగ ఆశించి తీవ్రనష్టం చేస్తోంది. తొలిదశలోనే గుర్తించి నివారించినట్లైతే మంచి దిగుబడులను సాధించేందుకు అవకాశం ఉంది. మొవ్వు తొలుచు ఈగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త  డా. రాం ప్రసాద్.

మొవ్వు తొలుచు ఈగ  నివారణ
కార్బోఫ్యూరాన్ 4 జి గుళికలు
ఇసుకలో కలిప ఆకు సుడుల్లో పడే విధంగా వేసుకోవాలి

తెలంగాణలో 1 లక్ష హెక్టార్లలో సాగు
ఆరుతడి పంటగా సెప్టెంబర్ – అక్టోబర్
ఆలస్యంగా వేసిన ప్రాంతాల్లో మొవ్వతొలుచు ఈగ

Read Also : Paddy Cultivation : రబీ వరి నారుమడులలో చేపట్టాల్సిన యాజమాన్యం