Spirulina Farming
Spirulina Farming : ప్రస్తుతం మనదేశంలో ఔషధ మొక్కలకు డిమాండ్ పెరిగింది. అందుకే చాలా మంది రైతులు సంప్రదాయ ఆహార పంటలను కాకుండా.. ఇలాంటి పంటల సాగువైపు మొగ్గు చూప్తున్నారు. మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ.. లక్షల్లో సంపాదిస్తున్నారు. అలాంటి పంటల్లో ఒకటి స్పైరిలినా . అనేక మందుల్లో దీనిని వినియోగిస్తున్నారు. నేరుగా టాబ్లెట్స్ రూపంలో కూడా విక్రయిస్తున్నారు. అందుకే దీనికి అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీన్నే ఆసరాగా చేసుకొని కృష్ణా జిల్లాకు చెందిన ఒక యువతి స్పైరిలిన సాగుచేస్తూ.. స్వయం ఉపాధి పొందుతున్నారు.
READ ALSO : Bharat : పాఠ్యపుస్తకాల్లో ఇండియాకు బదులుగా భారత్.. మార్పునకు ఎన్సీఆర్టీ సిఫారసు
స్పైరిలినాను సముద్ర నాచు అంటారు. అత్యంత ఆరోగ్యవంతమైన శాకాహారం. మాంసకృత్తులు అధిక మోతాదులో కలిగిన తొలి ఐదు ఆహారోత్పత్తుల్లో ఒకటి. ఇందులో 60 నుండి 70 శాతం ప్రొటీన్స్ ఉంటాయి. మంచి ఇమ్యూనిటీబూస్టర్‌గా పనిచేస్తుంది. ఇది మంచినీటిలో కూడా పెంచుకునే అవకాశం ఉంది. స్పైరిలినా పెంచడం వల్ల ప్రతి రోజు ఆదాయం వస్తుంది. అందుకే కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, తెలుగు రావుల పాలెం గ్రామానికి చెందిన యువతి తేజస్విని స్పైరిలినాను పెంచుతుంది.
READ ALSO : Buddha Venkanna : కొడాలి నానికి ఎన్టీఆర్ దేవుడు అయినప్పుడు ఆయన కుమార్తె భువనేశ్వరి దేవత కాదా? బుద్ధా వెంకన్న
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న నీటి తొట్టెలను చూడండీ.. ఇందులో నీరు ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి కదూ.. ఇదేదే పాకురు అనుకునేరు. ఇది ఒక నాచు పంట. రైతు తేజస్విని 6 నెలల క్రితం ఈ పంట సాగును ప్రారంభించారు. ఎంటెక్ చదువుకున్న తేజస్విని బిటెక్ కంప్యూటర్ సైన్స్. ఏదో ఒక ఉద్యోగం వెతుక్కొని నెల జీతం కోసం పనిచేయడం అమేకు ఇష్టం లేదు. ఏదైనా కొత్త పని చేసి నలుగురికీ ఉపాధి కల్పించే స్థితిలో తానుండాలనుకున్నారు. మంచినీటిలో పెరిగే ఒక రకమైన ఆకుపచ్చని నాచు స్పైరిలినాను చిన్న చిన్న మడుల్లో సాగు చేసే పనిని ప్రారంభించారు. మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుండటంతో అధిక లాభాలు పొందుతున్నారు.
READ ALSO : Google Samsung Apps : గూగుల్ హెచ్చరిక.. మీ ఫోన్‌లో ఈ 2 శాంసంగ్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!
స్పైరిలినా వర్షాకాలంలో కొంత దిగుబడి తగ్గినా, శీతాకాలం, వేసవి లో మాత్రం మంచి దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు, నీటి పిహెచ్ లు ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. అసలు ఈ స్పైరిలినాను ఏవిధంగా పెంచుకోవాలి. ఇందుకు కావాల్సిన వనరులేంటి.. తదితర అంశాలను తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త యశ్వంత్ కుమార్.
READ ALSO : Silk Production : పట్టుదారం ఉత్పత్తిలో పట్టు సాధించిన చేనేత దంపతులు
ఇండియాలో ఉత్పత్తి అవుతోన్న సగం విటమిన్ పౌడర్ల తయారీలో దీన్ని వాడుతున్నారు. విదేశాల్లో అయితే క్యాప్సూల్స్ గానూ జ్యూస్‌లు, బర్గర్, పిజ్జాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. మనం తీసుకునే 500 గ్రాముల ఆహారం వల్ల 30 నుంచి 40 ప్రొటీన్ వ్యాల్యూస్ లభిస్తుంది. అదే స్పిరులినా రోజుకు 20 గ్రాములు తీసుకుంటే 70 ప్రొటీన్ వ్యాల్యూస్ లభిస్తుంది. విదేశాల్లో దీనికి గిరాకీ ఎక్కువగా ఉంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ ఉత్పత్తులకు ఆదరణ బావుంటుంది.