Buddha Venkanna : కొడాలి నానికి ఎన్టీఆర్ దేవుడు అయినప్పుడు ఆయన కుమార్తె భువనేశ్వరి దేవత కాదా? బుద్ధా వెంకన్న

లోకేష్, పవన్ కళ్యాణ్ కలయికతో వైసీపీకి అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్లంతా జగన్ అనుచరులేనని ఆరోపించారు.

Buddha Venkanna : కొడాలి నానికి ఎన్టీఆర్ దేవుడు అయినప్పుడు ఆయన కుమార్తె భువనేశ్వరి దేవత కాదా? బుద్ధా వెంకన్న

Buddha Venkanna

Updated On : October 25, 2023 / 9:33 PM IST

Buddha Venkanna – Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ, షర్మిల ప్రచారం చేశారంటే జగన్ అసమర్థుడని కొడాలి నాని చెప్తారా? అని ప్రశ్నించారు. కొడాలి నాని దృష్టిలో జగన్ పనికిరాని వాడని ఇప్పటికైనా తన మనసులో మాటని బయట పెట్టాడని తెలిపారు.

తనని అర్ధాంతరంగా మంత్రి పదవి నుంచి తప్పించారనే బాధ కొడాలి నానికి ఉందని.. అందుకే జగన్ పనికిమాలిన వాడని అంటున్నాడని పేర్కొన్నారు. కొడాలి నానికి ఎన్టీఆర్ దేవుడు అయినప్పుడు ఆయన కుమార్తె భువనేశ్వరి దేవత కాదా అని ప్రశ్నించారు.

Nara Bhuvaneswari : చంద్రబాబును కాదు.. రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్బంధించారు : నారా భువనేశ్వరి

చంద్రబాబు లాయర్ల కోసం రూ.35 కోట్లు ఖర్చు పెట్టారంటున్న కొడాలి నాని, జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు రూ.4000 కోట్లు ఖర్చు పెట్టారా అని నిలదీశారు. భర్తకు జరిగిన అన్యాయంపై ప్రజల్లోకి వస్తే భువనేశ్వరిని చూసి వైసీపీ నేతలు వణికి పోతున్నారని ఎద్దేవా చేశారు.

లోకేష్, పవన్ కళ్యాణ్ కలయికతో వైసీపీకి అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్లంతా జగన్ అనుచరులేనని ఆరోపించారు. ఈ సంవత్సరం తమకు దీపావళి లేదని, జగన్ ఓడిన రోజే దీపావళి అన్నారు.