Sugarcane Cultivation Techniques : చెరకు సాగులో మెళకువలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

Sugarcane Cultivation Techniques : చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

Sugarcane Cultivation Techniques

Sugarcane Cultivation Techniques : తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే దీర్ఘకాలిక వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. 10 నుంచి 12 నెలల్లో చేతికొచ్చే ఈ పంటలో వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనేక రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారు. ముఖ్యంగా ఈ పంట విస్తీర్ణం అధికంగా వున్నా ఆశించినంత దిగుబడులను పొందలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కో ఆర్డినేటర్ డా. డి. చిన్నమ నాయుడు.

Read Also : Azolla Cultivation Methods : అజోల్లా పెంపకం.. సాగుతో తగ్గనున్న పశుగ్రాసం ఖర్చు 

ఫిబ్రవరి చివరి వరకు చెరకు నాటుకోవచ్చు :
చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీన్ని అధిగమించేందుకు యంత్రీకరణ విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు.

దీంతోపాటు అధిక దిగుబడినిచ్చే రకాలపై జరుగుతున్న విస్త్రృత పరిశోధనలతో, అనేక నూతన రకాల రూపొందటంతో, సాగులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా జనవరి నుంచి మార్చి వరకు చెరకు నాటతారు. రాయలసీమ ప్రాంతాల్లో జనవరి నుండి ఫిబ్రవరి లో నాటుతీరు.

ఆలస్యంగా నాటేవారికి మే వరకు సమయం :
ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆలస్యంగా నాటుకునే వారు మార్చి నుండి మే వరకు చెరకును నాటుకోవచ్చు. ఆయాప్రాంతాల వాతావరణం, భూమి స్థితిగతులకు అనుగుణంగా, అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికతోపాటు, విత్తన శుద్ధి, వరుసల మధ్య దూరం చూసుకోవాలి. ఒక్కసారి నాటుకుంటే 4, 5 సార్లు కార్శీ పంటలు తీసుకునే వేసులుబాటు ఉంటుంది కాబట్టి నాటేముందే సరైన నిర్ణయం తీసుకొవాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, నైరా వ్యవసాయ కళాశాల ప్రోఫెసర్ డా. డి. చిన్నమ నాయుడు.

విత్తన ఎంపిక, నాటే పద్ధతి ఒకటైతే ఎరువుల యాజమాన్యం మరోఎత్తు. సమయానుకూలంగా, శాస్త్రవేత్తల సూచనల ప్రకాశం ఎరువులను అందిస్తే మంచి దిగుబడిని సాధించవచ్చు. అయితే మితిమీరిన ఎరువులు వేయకుండా ముందుగానే భూసార పరీక్షలు చేయించుకోవాలి. అంతే కాదు చెరకు నాటిన తరువాత వచ్చే కలుపును అరికట్టే చర్యలు చేపట్టినట్లైతే నాణ్యమైన దిగుబడిని తీసుకునేందుకు వీలుంటుంది.

Read Also : Intercropping in Cabbage : క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటల్లో అంతరపంటల సాగు

ట్రెండింగ్ వార్తలు