Sorghum Cultivation : ఖరీఫ్ జొన్న సాగులో మేలైన యాజమాన్యం

వర్షాధారంగా సాగుచేసే జొన్న పంటకు ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. సమానుకూలంగా ఎరువును వేసి,  అంతర కృషి చేస్తే మొక్కలు బలంగా పెరిగి మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉంది. ఆలస్యంగా జొన్న విత్తటం వల్ల పైరు తొలిదశలో  మొవ్వుతొలుచు ఈగ, కాండం తొలుచు పురుగులు ఆశిస్తాయి.

Sorghum Cultivation : ఖరీఫ్ లో వర్షాధారంగా పండేపంటల్లో జొన్న ముఖ్యమైనది. ఆహార పంటగానే కాక, పశువులకు మేతగా, కోళ్లకు దాణాగా వినియోగిన్నారు. రాయసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగు అవుతోంది. ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో రైతులు విత్తేందుకు పంట పొలాలను సిద్ధం చేస్తున్నారు. అయితే అధిక దిగుబడుల కోసం జొన్నసాగులో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. మహేశ్వరమ్మ.

READ ALSO : Corn Crop Cultivation : ఖరీఫ్ కు అనువైన మొక్కజొన్న రకాలు

ఒకప్పుడు జొన్నసాగు అధిక విస్తీర్ణంలో సాగయ్యేది. రాను రాను వ్యవసాయంలో వ్యాపార దృక్పధం పెరగటం, తక్కువ దిగుబడులవల్ల సాగు గిట్టుబాటుకాకపోవటం వల్ల రైతులు  జొన్న పంటకు దూరమవుతూ వచ్చారు. కానీ  ప్రస్తుతం పరిస్థితులు మారాయి. జొన్నఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 30 నుండి 40 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక  రకాలు, హైబ్రిడ్ లు,  రైతులకు అందుబాటులో ఉండటంతో  ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది.

2019 -20 ఖరీఫ్ సీజన్ లో  జొన్న కనీస మద్దతు ధర క్వింటాకు 120 రూపాయిలు పెరిగి 2430 రూపాయల నుండి 2550 రూపాయలకు చేరుకుంది. మద్దతు ధర ఆశాజనకంగా వుండటంతో రైతులు జొన్న సాగుతో మంచి ఫలితాలు సాధించే వీలుంది. జొన్న సాగుకు సారవంతమైన అన్నిరకాల నేలలు అనుకూలమైనప్పకీ,  నీరు నిలవని భూములు, చౌడు నేలలు పనికిరావు.  సాధారణంగా జూన్ నెల చివరి వరకు ఈ పంటను విత్తుకోవాలి.

READ ALSO : Jowar cultivation : జొన్నసాగులో తెగుళ్ళు, చీడపీడల నివారణ..

కానీ సరైన వర్షాలు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఇంకా విత్తనం వేయలేదు. ఈ పరిస్థితుల్లో సాగులో కొన్ని మార్పుటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.  మామూలుగా ఎకరాకు 3 కిలోల విత్తనం సరిపోతుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా 3 నుండి 5 కిలోల విత్తనాన్ని వేసుకోని సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. మహేశ్వరమ్మ .

వర్షాధారంగా సాగుచేసే జొన్న పంటకు ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. సమానుకూలంగా ఎరువును వేసి,  అంతర కృషి చేస్తే మొక్కలు బలంగా పెరిగి మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉంది. ఆలస్యంగా జొన్న విత్తటం వల్ల పైరు తొలిదశలో  మొవ్వుతొలుచు ఈగ, కాండం తొలుచు పురుగులు ఆశిస్తాయి. చివరిదశలో  బూజు తెగుళ్ల ఆశించి పంటకు తీవ్ర నష్టం చేకూర్చుతాయి. సకాలంలో వీటిని అరికడితే మంచి దిగుబడులను పొందవచ్చు.

READ ALSO : Maize Cultivation : మెట్టప్రాంతంలో సిరులు కురిపిస్తున్న మొక్కజొన్న సాగు

జొన్నను ఏక పంటగా కాకుండా అంతర పంటలుగా కంది, అలసంద, సోయాచిక్కుడు లాంటి పంటలను సాగుచేసుకుంటే మంచిది. నాలుగు జొన్న వరసలకు ఒక వరస వేసుకుంటే ప్రకృతి వైపరిత్యాల కారణంగా ఒక పంట పోయినా మరో పంట రూపంలో పెట్టుబడి వచ్చేందుకు వీలుంటుంది.

ట్రెండింగ్ వార్తలు