Corn Crop Cultivation : ఖరీఫ్ కు అనువైన మొక్కజొన్న రకాలు

వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది.  వర్షపాతం ఆధారంగా, సాగునీటికింద మొక్కజొన్నను విత్తుతున్నారు.

Corn Crop Cultivation : ఖరీఫ్ కు అనువైన మొక్కజొన్న రకాలు

Corn Crop Cultivation

Corn Crop Cultivation : మొక్కజొన్న మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ పంట కాలం దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రైతులు వేసుకోవాల్సిన మధ్య, స్వల్పకాలిక రకాల గురించి తెలియజే సూచిస్తున్నారు  రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. జి. అనురాధ.

READ ALSO : Maize Cultivation : మెట్టప్రాంతంలో సిరులు కురిపిస్తున్న మొక్కజొన్న సాగు

వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది.  వర్షపాతం ఆధారంగా, సాగునీటికింద మొక్కజొన్నను విత్తుతున్నారు.

అయితే  ఏటా జూన్ మొదటి వారంలోనే వర్షాలు పడుతుంటాయి. వర్షం పడిన వెంటనే మొక్కజొన్నను రైతులు సాగుచేస్తుంటారు . జూన్ మొదటి వారంలో అయితే ధీర్ఘకాలిక రకాలను సాగుచేసుకోవచ్చు. వర్షాలు  ఆలస్యమైతే స్వల్పకాలిక రకాలను వేసు కోవాలని రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. జి. అనురాధ సూచిస్తున్నారు.

READ ALSO : High Moisture Corn : మొక్కజొన్నలో తేమ వల్ల నష్టం జరగకుండా నివారిస్తే!

మొక్కజొన్న సాగుకు నీరు ఇంకే నల్లరేగడి, నీటి వసతివున్న ఎర్రనేలలు లేదా ఒండ్రు కలిగిన ఇసుక నేలలు అనుకూలం. చౌడు నేలలు, నీరు ఇంకని నల్ల భూముల్లో సాగు చేయరాదు. ఇటు లేత దశలో మొక్కలను తెగుళ్ల బారినుండి కాపాడుకునేందుకు విత్తనశుద్ధి తప్పని సరిగా చేయాలి.

READ ALSO : Irrigation Management : మొక్కజొన్నలో రైతులు అనుసరించాల్సిన నీటి యాజమాన్య పద్ధతులు !

మంచి హైబ్రీడ్ రకాలు ఉన్నా రైతులు అంతగా దిగుబడి తీసుకోలేక పోతున్నారు. సారవంతమైన నేలల్లో సాగుచేయకపోవడమే కాకుండా, సమయానుకూలంగా నాటక పోవడం, ఇటు కలుపు నివారణ సరిగా చేయకపోవడంతో పెద్దగా దిగుబడులను సాధించలేకపోతున్నారు . వీటిపై దృష్టిపెట్టి,  పోషక యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులను సాధించవచ్చు.