Maize Cultivation : మెట్టప్రాంతంలో సిరులు కురిపిస్తున్న మొక్కజొన్న సాగు
స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న.. రైతుల ఆదరణ పొందుతుంది. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్ లో వర్షాధారంగా , రబీలో నీటిపారుదల కింద సాగుచేస్తుంటారు

Mokkajonna Corn
Maize Cultivation : ఈ రబీలో చాలా మంది రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలను సాగుచేశారు. ముఖ్యంగా తక్కువ సమయంలో, ఎక్కువ ఆదాయం పొందే పంటలను ఎంచుకున్నారు. స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న.. రైతుల ఆదరణ పొందుతుంది. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్ లో వర్షాధారంగా , రబీలో నీటిపారుదల కింద సాగుచేస్తుంటారు రైతులు.
READ ALSO : Irrigation Management : మొక్కజొన్నలో రైతులు అనుసరించాల్సిన నీటి యాజమాన్య పద్ధతులు !
ఈ కోవలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ రైతు… ప్రయోగాత్మకంగా మొక్కజొన్న పంటను సాగు చేశారు. పంట ఆశాజనకంగా ఉండటం.. మరికొద్ది రోజుల్లో కోత కోయనున్న ఈ పంటపై అధిక ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోనసీమ జిల్లాల్లో రెండు కాలాల్లోనూ.. వరినే సాగుచేస్తుంటారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, తాపేశ్వరం మండలం, వెలగపూడి గ్రామానికి చెందిన రైతు గుణ్ణం రమేష్ మాత్రం ప్రయోగాత్మకంగా మొక్కజొన్నను సాగుచేశారు. 18 ఎకరాల కౌలు భూమిలో ఖరీఫ్ వరి అనంతరం జీరోటిల్లేజ్ విధానంలో మొక్కజొన్నను నాటారు.
READ ALSO : Corn : మొక్కజొన్నలో చీడపీడలు… నివారణ
ఆరుతడి పంట కావడం.. నీటి వినియోగంతో పాటు తక్కువ పెట్టుబడి పంట ఆశాజనకంగా పెరిగింది. మరో వారం రోజుల్లో కోతకోయనున్న ఈ పంట అధిక దిగుబడి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. మర్కెట్ లో కూడా మొక్కజొన్నకు మంచి ధర పలుకుతుండటంతో .. అధిక లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతు.