Sweet Corn Cultivation
Sweet Corn Cultivation : తక్కువకాలంలో రైతుకు మంచి నికర రాబడినిచ్చే పంటగా తీపి మొక్కజొన్న సాగు ప్రాచుర్యం పొందుతోంది. దీన్నే స్వీట్ కార్న్ గా పిలుస్తారు. గతంలో మార్కెటింగ్ ఇబ్బందులున్నా… రిటైల్ మార్కెట్లు, సూపర్ బజార్ల రాకతో వీటికి డిమాండ్ పెరిగింది. స్టార్ హోటళ్ళు, సినిమా హాళ్ళలో వాడకం పెరగటంతో సంవత్సరం పొడవునా తీపిమొక్కజొన్న సాగును దఫదఫాలుగా చేపడుతూ మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. నీటి వసతి వున్న ప్రాంతాల్లో ఏడాది పొడవునా సాగును నిరంతరాయంగా కొనసాగించవచ్చని సాగు వివరాలు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం సీనియర్ శాస్ర్తవేత్త డా. బద్రు.
READ ALSO : Anakapalli : ఆ చేప ఖరీదు రూ.3 లక్షలు.. ప్రత్యేకత ఏంటంటే?
ఒకప్పుడు గింజకోసం వాణిజ్యసరళిలో సాగుచేసే మొక్కజొన్న నేడు స్వీటకార్న్, బేబీకార్న్, పేలాలు, దాణా రూపంలోను, పశువులకు మేతగా…ఇలా పలు రకాలుగా వినియోగంలో వుంది. స్వీట్ కార్న్ లేదా తీపిమొక్కజొన్నగా సాగు గతంలో పరిమితంగా వున్నా.. నేడు మారుతున్న ఆహారపు అలవాట్లలో భాగంగా దీని వినియోగం పెరిగింది.
READ ALSO : చర్మ ఆరోగ్యంతోపాటు, రక్త ప్రసరణను మెరుగు పరిచే మొక్కజొన్న!
దీంతో మార్కెట్ డిమాండ్ ను అందిపుచ్చుకుంటూ, తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాలలో దీనిసాగు ఊపందుకుంది. అందుకు తగ్గట్లుగానే అధిక దిగుబడినిచ్చే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు హైబ్రిడ్ తీపిమొక్కజొన్న రకాలు రైతులకు అందుబాటులో వుండటంతో సాగు మరింత లాభదాయకంగా మారింది. నగరాల్లో స్వీట్ కార్న్ లేని మాల్స్ వుండవు. కేవలం స్నాక్స్ రూపంలోనే కాదు, వివిధ వంటకాలు, బేకరీ ఉత్పత్తులలో కూడా స్వీట్ కార్న్ దర్శనమిస్తోంది.
READ ALSO : Kharif maize : ఖరీఫ్ మొక్కజొన్న సాగులో పాటించాల్సిన జాగ్రత్తలు..నాణ్యతా ప్రమాణాలు
పంట తొలిదశలో కలుపును సమర్థవంతంగా అరికట్టినట్లయితే పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. అంతేకాదు, చీడపీడలను కూడా ఆదుపులో ఉంటాయి. తీపి మొక్కజొన్న మనం అదించే పోషకాల ఆధారంగా పెరుగుదలను కనబరుస్తుంది. సమయానుకూలంగా అందించే సమతుల్య పోషక యాజమాన్యంతోపాటు, కలుపును అదుపులో వుంచినపుడే వాటి వినియోగ సామర్థ్యం అధికంగా వుంటుంది.
READ ALSO : Drumstick Fodder : పశుగ్రాసంగా మునగ.. సాగు చేపట్టే విధానం
తీపి మొక్కజొన్న కోత సమయాన్ని గుర్తించడం అతిముఖ్యమైనది. పీచు గట్టిపడినప్పుడు 15-20 రోజు మధ్యలో తప్పకుండా కోయాలి. కంకి ముదిరితే చక్కర శాతం తగ్గి మార్కెట్ లో ధర పలకదు. విత్తనం మొదలు కొని, నీటియాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చు. అంతే కాకుండా మార్కెట్ కు అనుగుణంగా ప్రణాళిక బద్దంగా సాగుచేయడం వలన నిరంతరంగా పంట దిగుబడులు వచ్చి మార్కెట్ లో ఒక సారి కాకపోయిన మరోసారి మంచి ధర లభించే అవకాశం ఉంది.