Drumstick Fodder : పశుగ్రాసంగా మునగ.. సాగు చేపట్టే విధానం

విత్తనం లేదా ప్రోట్రేలో పెంచిన నారుని విత్తేటప్పుడు రెండు వరసల మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండాలి. ఈ రకంగా నాటుకున్నట్లైతే ఒక హెక్టారుకు 100 కిలోల విత్తనం అవసరం అవుతుంది.

Drumstick Fodder : పశుగ్రాసంగా మునగ.. సాగు చేపట్టే విధానం

Drumstick Cultivation

Drumstick Fodder : మునగ ఆరోగ్యానికి ఉవయోగపడుతుంది. మునగ కాయ మరియు ఆకులలో అధిక మోతాదులో మాంసకృతులు, విటమిన్‌, మినరల్‌ , అనేక రకాల రోగనిరోధక గుణాలతో కలిగి ఉండటం వల్ల వీటిని ఆహారపదార్థంగానే కాకుండా ఔషధంగ కూడా వాడుతున్నారు. మునగ చెట్టు వేగంగా పెరుగుతుంది. కరువు ని తట్టుకుంటుంది. ఇన్ని గుణాలు ఉన్న మునగను పశువులకు మేతగా సాగు చేయవచ్చు.

READ ALSO : Drumstick Crop : మునగ కార్శీతోటల యాజమాన్యం

మునగను పశుగ్రాసముగ సాగు చేసుకున్నట్లు అయితే సంవత్సరానికి 100 టన్నుల వచ్చి మేత సేకరించవచ్చు. సాగు కొరకు మేలైన పి.క.ఎం.1 లేదా పి.కె.ఎం.2 రకాలను ఎంపిక చేసుకున్నట్లు అయితే దిగుబడులు లాభదాయకంగా ఉంటాయి.

మునగ పశుగ్రాసము యొక్క పోషక విలువలు ;

మునగ ఆకు మరియు కాండం వివిధ రకాల పోషకాలతో నిండి ఉంటుంది. వేరే బహువార్షిక పశుగ్రాసములో 8-12% మాంసకృత్తులు ఉంటాయి. అయితే మునగ పశుగ్రాసములో 16% మాంసకృత్తులు లభిస్తాయి. ఇందులో 18% పీచు పదార్థం మరియు 3.5% కొవ్వు ఉంటుంది. కాల్షియం, భాస్వరం, మెగ్నిషియం, కాపర్‌, పొటాషియం వంటి అనేక రకాల ఖనిజ లవణాలు ఉంటాయి. విటమిన్‌ ఎ, ఈ, బి, సి, కెరోటినాయిడ్స్‌ మరియు సలఫర్‌ రిచ్‌ ఎమినో ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మునగ సాగు ఏడాది పొడువునా పచ్చి మేత కొరతను అధిగమిస్తుంది. మునగ పశుగ్రాసము యొక్క ఇంకొక్క గుణము ఏంటంటే ఇందులో ఎటువంటి విష పదార్థాలు ఉండవు. జొన్న మరియు నేపియర్‌ పశుగ్రాసాలలో ఉండేటి సైనైద్‌ మరియు కాల్షియం కొరతకు కారణమైన ఆక్సలేట్‌ వంటి పదార్థాలు మునగలో ఉండవు.

READ ALSO : Munaga Sagu : 8 ఎకరాల్లో మునగసాగు.. 7 నెలలకే రూ. 16 లక్షల ఆదాయం

సాగు విధానం:

మునగ సాగు కొరకు ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు మరియు ఒండ్రు నేలలు అనువైనవి. నీరు నిలువ ఉండకూడదు. విత్తనాలు నాటే 15 రోజుల ముందుగా, పొలంలో హెక్టారుకు 5-10 కిలోల చొప్పున పశువుల ఎరువు వేసి బాగా కలియ దున్నాలి. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. నాటే ముందు విత్తనాలను 7-8 గంటల వరకు మంచి నీటిలో నాన పెట్టాలి. ఆ తరువాత నీళ్లను పూర్తిగా తీసేసి, విత్తనం శుద్ధి చేసుకోవాలి. దీని కొరకు విత్తనాలను టైకోడర్మా విరిడి లేదా కార్బండజిమ్‌ మందుని 1 కిలో విత్తనానికి 5 గ్రామలు కలపాలి. ఇలా చేసినట్లయితే విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి మరియు వేర్లు కుళ్ళకుండా నిరోధించుకోవచ్చు.

ఎరువుల యాజమాన్యంలో మునగ సాగుకు సంవత్సరానికి 150 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం మరియు 40 కిలోల పొటాషియం ఒక హెక్టారుకు అవసరం అవుతుంది. నాటేటప్పుడు 80 కిలోల నత్రజని, భాస్వరం మరియు పొటాషియం వేసుకోవాలి. నత్రజని మరియు భాస్వరం ని అమ్మోనియం సల్ఫేట్‌ మరియు సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ రూపంలో అందించవచ్చు. జింక్‌ లోపం ఉన్న ప్రదేశాలలో, హెక్టారుకు 10 కిలోల జింక్‌ సల్ఫేట్‌ వేసుకున్నట్లయితే జింక్‌ లోపాన్ని అధిగమించవచ్చు.

READ ALSO : Natural Farming : గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో.. మూడు రెట్ల ఆదాయం పొందుతున్న రైతు

విత్తనం లేదా ప్రోట్రేలో పెంచిన నారుని విత్తేటప్పుడు రెండు వరసల మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండాలి. ఈ రకంగా నాటుకున్నట్లైతే ఒక హెక్టారుకు 100 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తిన తరువాత, పెండిమేథాలిన్‌ వంటి కలుపు మందు 1-1.5 కిలో ఒక హెక్టార్‌ చొప్పున వేసుకోవాలి. ప్రతి 15-20 రోజులకు ఒక సారి మట్టి మరియు వాతావరణాన్ని బట్టి నీటి తడి ఇచ్చుకోవాలి. మంచి దిగుబడి కోసం అప్పుడప్పుడు కలుపు తీసేస్తూ ఉండాలి.

కోత సమయం, విధానం ;

మొదటి కోత విత్తిన 3 నెలలకు సేకరించవచ్చు. తదుపరి కోతలు ప్రతి 2 నెలల వ్యవధిలో తీసుకోవచ్చు. కటింగ్‌ భూమి నుండి 30 సెంటీమీటర్లు ఎత్తులో చేయాలి. మొదటి కొతలో హెళ్టార్‌ కు 30- 40 టన్నుల దిగుబడి పొందవచ్చు. ఒక సంవత్సరంలో 100-120 టన్నుల దిగుబడి ప్రతి హెక్టార్‌ కు పొందవచ్చు. ప్రతి కోత తరువాత, నత్రజని హెక్టారుకు 30 కిలోల చొప్పున వేసుకోవాలి.

ఈ విధముగా సేకరించిన మునగ ఆకులను మరియు కాండాన్ని చాఫింగ్‌ మెషిన్‌ సహాయముతో చిన్న-చిన్న ముక్కలుగా తయారు చేసుకోవాలి. వీటిని పచ్చి మేత తో కలిపి ఒక పశువుకు ప్రతి రోజు షుమారు 15 కిలోల దాకా మేపవచ్చు.

READ ALSO : Drumstick Farming : మునగసాగులో అధిక దిగుబడినిచ్చే రకాలు ఇవే…

ఆదాయ- వ్యయం:

మునగ పశుగ్రాసము సాగుకు అయ్యే ఖర్చుని వేరే బహువార్నిక పశుగ్రాసము తో పోల్చినట్రైతే అయితే, మునగ సాగు లాభదాయకంగా ఉంటుంది. ఒక కిలో పశుగ్రాసాన్ని సాగు చేయటానికి సుమారుగా రూ. 2.00 ఖర్చు అయ్యి నట్లు అయితే ఒక కిలో మునగ పశు గ్రాసమ సాగు కు అయ్యే ఖర్చు రూ.1.50 మాత్రమే.