Drumstick Crop : మునగ కార్శీతోటల యాజమాన్యం

మునగ మొక్క తోటను నరికిన తర్వాత, ఆ మోళ్ల నుండి వచ్చే పిలకల ద్వారా  ఇంకో పంటను తీసుకుంటారు. దీన్ని కార్శి లేదా మోడెం పంట అంటారు. జూన్ , జులై నెలల్లో మునగను నరికిన తర్వాత  రైతులు కార్శి తోటల నిర్వహణపట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.

Drumstick Crop : మునగ కార్శీతోటల యాజమాన్యం

Drumstick Crop Cultivation

Drumstick Crop : తెలుగు రాష్ట్రాల్లో సాగుచేయబడుతున్న కూరగాయ పంటల్లో మునగా ఒకటి. ఇప్పటికే మొక్కతోటలు నాటిన ప్రాంతాలలో పైరు నెలరోజుల వయస్సులో ఉంది. మొక్క తోటలు నరికిన రైతాంగం తిరిగి కార్శీ చేయటం సర్వసాధారం. మొక్కతొటలతో పొలిస్తే కార్శీతోటల్లో రైతుకు పెట్టుబడి ఖర్చు చాలా వరకు కలిసొస్తుంది.

READ ALSO : Udhayanidhi Stalin : ఉదయనిధి స్టాలిన్ తలపై రూ.10కోట్ల బహుమతి…అయోధ్య అర్చకుడి సంచలన ప్రకటన

అయితే కార్శీలో మేలైన యాజమాన్య పద్దతులు పాటించకపోవటం వల్ల దిగుబడులు నాశిరకంగా ఉంటున్నాయి. మొక్కతోటలకు ధీటుగా రెండవ పంట నుండి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే తప్పసరిగా కొన్ని మెళకువలు పాటించాలంటున్నారు  ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం , ఉద్యాన శాస్త్రవేత్త ,వనం చైతన్య.

READ ALSO : Shahrukh Khan : మొదటిసారి తిరుమలకు షారుఖ్ ఖాన్.. కూతురు సుహానా, నయనతారతో కలిసి.. జవాన్ ప్రమోషన్స్..

సాధారణంగా మునగ మొక్క తోటను నరికిన తర్వాత, ఆ మోళ్ల నుండి వచ్చే పిలకల ద్వారా  ఇంకో పంటను తీసుకుంటారు. దీన్ని కార్శి లేదా మోడెం పంట అంటారు. జూన్ , జులై నెలల్లో మునగను నరికిన తర్వాత  రైతులు కార్శి తోటల నిర్వహణపట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. మొక్క తోటతో పోలిస్తే కార్శిసాగులో రైతుకు యాజమాన్యం సులభం. సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.  ప్రస్తుతం  రైతులు మునగ కార్శితోటల సాగుకు సిద్ధమవుతున్నారు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే కార్శితోట నుంచి మంచి ఫలితాలు పొందవచ్చంటూ సూచిస్తున్నారు  ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం , ఉద్యాన శాస్త్రవేత్త , వనం చైతన్య.

READ ALSO : Aditya L1 : ఆదిత్య ఎల్ 1 రెండో భూకక్ష పెంపు విన్యాసం విజయవంతం…ఇస్రో వెల్లడి

గతంలో మునగలో బహువార్షిక రకాలను రైతులు సాగుచేసేవారు. ప్రస్తుతం ఏకవార్షిక పంటగా, అంతర పంటలుగా సాగుచేస్తున్నారు. అయితే ఏకవార్షిక పంటగా సాగుచేసే రైతులు మొక్కల మధ్య ఉన్న స్థలంలో అంతర పంటలుగా కూరగాయ పంటలు సాగుచేస్తే అదనపు ఆదాయాన్ని పొందేందుకు వీలుంటుంది.