Pest Prevention : వరిలో పెరిగిన చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

వాతావరణ పరిస్థితుల కారణంగా వరిలో ఉల్లికోడు, తాటాకుతెగులు, దోమకాటు , బాక్టీరియా ఎండాకు తెగులు , పాముపుడ , కాండంకుళ్లు ఆశించి , తీవ్రంగా నష్టపరుస్తున్నాయి.

Pest Prevention : ఖరీఫ్ సీజన్ లో రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో చాలాచోట్ల నాట్లు కూడా సమయానికి పడలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరి పిలకదశ నుండి అంకురం దశలో ఉంది. అయితే  ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక చీడపీడలు ఆశించినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి.

READ ALSO : Intercrop In Cashew : జీడిమామిడిలో అంతర పంటగా పత్తిసాగు

తెలంగాణలో ఈ ఖరీఫ్ లో వరి రికార్డ్ స్థాయిలో సాగయ్యింది. రైతులు అధికంగా సన్నగింజ రకాలనే సాగుచేశారు. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా వరిలో ఉల్లికోడు, తాటాకుతెగులు, దోమకాటు , బాక్టీరియా ఎండాకు తెగులు , పాముపుడ , కాండంకుళ్లు ఆశించి , తీవ్రంగా నష్టపరుస్తున్నాయి.

READ ALSO : Nara Brahmani : వైసీపీ అసమర్థ పాలన, నిజాన్ని కూడా చూడలేని కపోదులు : నారా బ్రాహ్మణి

రైతులు వీటిని గుర్తించిన వెంటనే శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే వీటి నుండి పంటను కాపాడుకొని మంచి దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. మరి అవేంటో కరీంనగర్ జిల్లా , జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి ద్వారా తెలుసుకుందాం..

ట్రెండింగ్ వార్తలు