Sustainable Agriculture with Startups in Telugu
Sustainable Agriculture : దేశ ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధికి స్టార్టప్ లు అవసరమాని జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని నార్మ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన వ్యవసాయాన్ని వ్యాపారంగా పరిగణించి అదనపు విలువ జోడించినప్పుడే లాభదాయకంగా మారుతుందన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వ్యవసాయరంగంలో ఉన్న సవాళ్ళు.. వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించారు.
భారతదేశంలో స్థిరమైన వ్యవసాయ స్టార్టప్ ల నిర్మాణం అనే అంశంపై ICAR-NAARM, a-IDEAతో కలిసి రెండు రోజులపాటు హైదరాబాద్, రాజేంద్రనగర్ లో జాతీయ సదస్సును నిర్వహించింది. ఇందులో విద్యావేత్తలు, స్టార్టప్‌లు, ఇంక్యుబేటర్లు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, అభివృద్ధి ఏజెన్సీలు, రైతులు, విధాన రూపకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, రైతులు, బ్యాంకులు పాల్గొని తమ నైపుణ్యం, అనుభవాలను పంచుకున్నాయి. వ్యవసాయ రంగం నీటి కొరత, సహజ వనరుల క్షీణత, కాలుష్యం వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటన్నింటికీ వ్యవసాయ అంకుర సంస్థలు పరిష్కారం చూపాలని జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు.
వ్యవసాయ రంగంలో అద్భుతమైన అవకాశాలున్నాయి. అంకుర సంస్థల ప్రయోగాలు విజయవంతమయ్యేలా రైతులకు శిక్షణ ఇవ్వాలి. ప్రపంచ విత్తన మార్కెట్‌లో భారతదేశం వాటా 0.2% మాత్రమే ఉంది. ఇది గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని నూజివీడు సీడ్స్ లిమిటెడ్ ఛైర్మన్ ప్రభాకర్‌రావు అన్నారు.
దేశంలోని పలు అగ్రి స్టార్టప్‌లు, ఎఫ్‌పిఓలు, ఐకార్ ఇనిస్టిట్యూట్ ల ఏబిఐలు, బ్యాంకు పరిశ్రమలు నార్మ్ లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పాల్గొన్నాయి. తమ ఉత్పత్తులు , సాంకేతికత ఈ సందర్బంగా ప్రదర్శించాయి. ఇందులో ముఖ్యంగా వ్యవసాయంలో పనులను తక్కువ ఖర్చుతో సులభతరంగా చేసేందుకు అనేక పనిముట్లు ఉన్నాయి. అలాగే రైతులు పండించే పంటలకు విలువలు జోడించి.. ఉప ఉత్పత్తులను తయారుచేసి మార్కెట్ చేస్తున్నాయి.
Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్లో వరిగట్లపై కూరగాయల సాగు