Cotton Crop : వర్షాలు పడుతున్న సమయంలో పత్తిలో పాటించాల్సిన మెళుకువలు

ఈ ఏడాది చాలా మంది రైతులు పత్తిసాగు చేపట్టారు. ప్రస్తుతం పత్తి 25 - 45 రోజుల దశలో ఉంది . అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచి పోయింది. ఇటు గాలిలో తేమశాతం అధికంగా ఉండటంతో చీడపీడలు సోకే ప్రమాదం ఏర్పడింది.

cotton Crop

Cotton Crop : వరుసగా కురుస్తున్న వర్షాలకు మెట్ట పంటల్లో చాలా సమస్యలు తలెత్తాయి.  పంటల్లో నీరు నిలవడం , గాలిలో తేమశాతం అధికంగా ఉండటం వలన చీడపీడలు సోకే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇటు కలుపు కూడా అధికంగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా పత్తి పంట వివిధ ప్రాంతాల్లో నాలుగు ఆకుల దశలో ఉంది. పత్తి అధిక తేమను, అధిక వర్షాన్ని తట్టుకోలేదు , కాబట్టి ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులను సాధించేందుకు అవకాశం ఉందంటున్నారు ఖమ్మం జిల్లా,  వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్  డా. హేమంత్ కుమార్ .

READ ALSO : Hyderabad: ఇళ్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోన్న హైదరాబాద్.. 26 శాతం పెరిగిన సేల్స్

ఈ ఏడాది చాలా మంది రైతులు పత్తిసాగు చేపట్టారు. ప్రస్తుతం పత్తి 25 – 45 రోజుల దశలో ఉంది . అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచి పోయింది. ఇటు గాలిలో తేమశాతం అధికంగా ఉండటంతో చీడపీడలు సోకే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు  ఖమ్మం జిల్లా,  వైరా కృషి విజ్ఞాన కేంద్రం, ప్రోగ్రాం కో ఆర్డినేటర్  డా. హేమంత్ కుమార్ .

READ ALSO : Nagarjuna : నాగార్జున ఇప్పటికి మన్మథుడిగా ఉండటానికి కారణం అదేనా.. డైలీ రాత్రి పడుకునేటప్పుడు అది తినాల్సిందేనట..

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కలుపు సమస్యగా మారుతుంది. ముఖ్యంగా బరువు నేలల్లో అంతర కృషి సాధ్యం కాదు. అలాంటప్పుడు రసాయన ఎరువులతో కలుపును నివారించాలి. అంతే కాకుండా నీరు నిలిచిన నల్ల నెలల్లో తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాంతాల్లో యాజమాన్యంపై శ్రద్ధ పెట్టాలంటున్నారు  శాస్త్రవేత్తలు

 

ట్రెండింగ్ వార్తలు