Tomato Cultivation : ట్రెల్లిస్ పద్ధతిలో టమాట సాగు – అధిక దిగుబడులకు మంచి అవకాశం  

Tomato Cultivation : టమాట పంటను సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లోనూ సాగుచేయవచ్చు. అధిక దిగుబడికి మాత్రం శీతాకాలం వస్తుంది . బాగా నీరు ఇంకే బరువైన గరపనేలలు ఈ పంటకు అనుకూలం.

Tomato Cultivation

Tomato Cultivation : కూరగాయ పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట టమాట. ఏడాది పొడవునా  సాగుకు అనుకూలం . ఒక్క  సీజన్ లో ధరలు పతనమైనా, మరో సీజన్ లో నైనా ఆశాజనకంగా ఉంటాయన్న నమ్మకంతో సాగుచేస్తుంటారు  రైతులు  .  ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షాలకు మొక్కలు నేలకు వాలిపోతుంటాయి. పలు చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది. దీని వల్ల దిగుబడుల్లో నాణ్యత తగ్గిపోతుంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు  ట్రెల్లీస్ విధానంలో సాగుచేస్తే  మొక్కలు నాణ్యంగా ఉండటమే కాకుండా మేలైన దిగుబడులు సాధించే అవకాశం ఉందంటున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. సునీత.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

టమాట పంటను సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లోనూ సాగుచేయవచ్చు. అధిక దిగుబడికి మాత్రం శీతాకాలం వస్తుంది . బాగా నీరు ఇంకే బరువైన గరపనేలలు ఈ పంటకు అనుకూలం. మురుగు నీటి వసతి లేని భూములు, చౌడు భూములు తప్పా  అన్ని రకాల నేలల్లో  ఈ పంటను సాగు చేయవచ్చు. సాధారణ పద్ధతిలో సాగుచేస్తే ఖరీఫ్ లో కురిసే వర్షాలకు మొక్కలు నేలపై వాలి, కాయలు నేలకు తాకి కాయకుళ్లు, మొదలు కుళ్లు, వట్టి తెగుళ్లు, చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి  రకాల ఎంపిక తో పాటు ట్రెల్లీస్ విధానంలో టమాట సాగు చేస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా  నాణ్యమైన దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. సునీత.

సాధారణ పద్ధతిలో పండించే దానికంటే ట్రెల్లీస్ విధానంలో టమాటను పండిస్తే మూడు రేట్లు అధికంగా దిగుబడి వస్తుంది. ఈ పద్దతిలో మొక్కలను ఎడంగా పెట్టి నాటుకోవడం వల్ల మంచి వాతావరణంతో పాటు మొక్క ఏపుగా పెరుగుతుంది. దీంతో అధికంగా కొమ్మలు వచ్చి పూత అధికంగా పూస్తుంది. నేలపైన టమాట కాయలు ఉండకుండా కట్టేతో తీగ పోవడం వల్ల టమాట కాత పైనే ఉంటుంది. దీని వల్ల టమాట పెద్దగా నాణ్యతగా, ఎలాంటి మచ్చలు లేకుండా అధిక బరువుతో టమాట అధికంగా కాస్తుంది. ఈ టమాటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. మంచి ధర కూడా పలుకుంది.  ట్రెల్లీస్ పద్ధతిలో టమాట సాగుకు ఉద్యానశాఖ ఎకరాకు 7 వేల 500 రూపాయల సబ్సిడీ కూడా ఇస్తోంది. అసలు  ట్రెల్లీస్ విధానంలో టమాట సాగు ఎలా చేయాలో  తెలుసుకుందాం.

ట్రెల్లీస్ పద్ధతిలో డ్రిప్ , మల్చింగ్ షీట్ వాడటం వలన మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, నాణ్యమైన దిగుబడిని తీసుకోగలరు. అంతే కాకుండా నీటి ఆదాతో పాటు కలుపు సమస్య తగ్గుతుంది. చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి. కలుపు తక్కువగా ఉండటం వల్ల కూలీలపై పెట్టె ఖర్చు కూడా తగ్గుతుంది.  సాధారణ పద్ధతిలో ఎకరాకు 10 – 15 టన్నుల దిగుబడి వస్తే, ట్రెల్లీస్ విధానంలో 25- 40 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కొంత శ్రమైనా ఈ విధానంలో యాజమాన్యం చేపట్టడం సులువుగా ఉండటమే కాకుండా , మంచి దిగుబడులు సాధించి, అధిక ఆదాయాన్ని పొందవచ్చు.

Read Also : Hybrid Bottle Gourd : హైబ్రిడ్ సొర రకాలు – సాగు యాజమాన్యం

ట్రెండింగ్ వార్తలు