Mushroom Cultivation : పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ.. ఏడాది పొడవునా మంచి ఆదాయం

ప్రస్తుతం పుట్టగొడుగులకు మార్కెట్లో బాగానే డిమాండ్ ఉంది. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం. పుట్టగొడుగుల పెంపకానికి పెద్ద పొలం అవసరం లేదు. మీ ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఎంచక్కా పుట్టగొడుగులను సాగు చేయవచ్చు.

Mushroom Cultivation

Mushroom Cultivation : పుట్టగొడుగుల పెంపకం అనేది తక్కువ పెట్టుబడి.. తక్కువ స్థలంతో ప్రారంభించగల అత్యంత విజయవంతమైన వ్యాపారాలలో ఒకటి. అనేక మంది అదనపు ఆదాయం, ప్రత్యామ్నాయంగా పుట్టగొడుగుల పెంపకం చేపడుతున్నారు. అయితే వీటిని పెంచాలంటే శిక్షణ తప్పని సరి. అందుకే పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ అందిస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, ఉండి కృషి విజ్ఞాన కేంద్రం తో కలిసి బి ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ వారు.

READ ALSO : Cotton Crop : వర్షాలు పడుతున్న సమయంలో పత్తిలో పాటించాల్సిన మెళుకువలు

చదువు పూర్తైన వెంటనే అందరూ ఉద్యోగాల వేటలో ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు అధికంగా పోటీ ఉంటుంది. స్కిల్స్ ఉంటే తప్ప ప్రైవేట్‌లో జాబ్ రాదు. ఇలా ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత చాలా మందే ఉంటారు. ఐతే మీరంతా కాలీగా ఉండే బదులు.. ఇంటి వద్దే ఉంటూ.. తక్కువ పెట్టుబడితో ఎన్నో రకాల వ్యాపారాలు చేయవచ్చు. అందులో ఒకటి పుట్టగొడుగుల పెంపకం. పుట్ట గొడుగులు ఆరోగ్యానికి ఎంతో మంచింది. ఎన్నో ఔషధాల గుణాలున్నాయి.

READ ALSO : Mushrooms : శరీరంలో ప్రోటీన్ కొరత ఏర్పడకుండా ఉండాలంటే తరచుగా పుట్టగొడుగులు తీసుకోవటం మంచిదా?

అందుకే ప్రస్తుతం పుట్టగొడుగులకు మార్కెట్లో బాగానే డిమాండ్ ఉంది. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం. పుట్టగొడుగుల పెంపకానికి పెద్ద పొలం అవసరం లేదు. మీ ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఎంచక్కా పుట్టగొడుగులను సాగు చేయవచ్చు. దీని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటే చాలు. పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి ఉన్న చదువుకున్న యువతకు శిక్షణ ఇస్తోంది బి ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో పశ్చిమగోదావరి జిల్లా, ఉండి కృషి విజ్ఞాన కేంద్రం.

READ ALSO : Self Employment : ఉద్యోగం రాలేదని బాధపడే యువతకు ఆదర్శంగా నిలుస్తున్న దంపతులు.. పుట్టగొడుగులు, నాటుకోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి

రైతులకు ఏడాది పొడవునా మంచి ఆదాయాన్నిచ్చే వ్యవసాయ అనుబంధ రంగం పుట్టగొడుగుల పెంపకం. పుట్టగొడుగులలో అధిక దిగుబడులు ఇచ్చే రకం మాత్రం పాల పుట్టగొడుగు . అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ పెట్టుబడితోనే వీటి పెంపకం చేపడితే నిరంతరాయంగా మంచి ఆదాయాన్ని పొందవచ్చని సూచిస్తున్నారు నిర్వహకులు.