Self Employment : ఉద్యోగం రాలేదని బాధపడే యువతకు ఆదర్శంగా నిలుస్తున్న దంపతులు.. పుట్టగొడుగులు, నాటుకోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి

ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదని బాధపడే వారు ఎందరో ఉన్నారు. ఇంత చదువు చదివి ఉద్యోగం రాక బతికేది ఎలాగో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఉపాధి మార్గం అన్వేషణలో అష్టకష్టాలు పడుతున్నారు. అలాంటి నిరుద్యోగ యువతకు ఈ దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Self Employment : ఉద్యోగం రాలేదని బాధపడే యువతకు ఆదర్శంగా నిలుస్తున్న దంపతులు.. పుట్టగొడుగులు, నాటుకోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి

Self Employment

Self Employment With Country Chicken Farming, Mushrooms ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదని బాధపడే వారు ఎందరో ఉన్నారు. ఇంత చదువు చదివి ఉద్యోగం రాక బతికేది ఎలాగో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఉపాధి మార్గం అన్వేషణలో అష్టకష్టాలు పడుతున్నారు. అలాంటి నిరుద్యోగ యువతకు ఈ దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. డిగ్రీ చదివిన ఆ దంపతులు ఉద్యోగం రాలేదని చింతించ లేదు. తమ దురదృష్టాన్ని తిట్టుకుంటూ కాలం వెళ్లదియ్యలేదు. పుట్టగొడుగులు, నాటుకోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుని ఆర్థికంగా నిలదొక్కుకుని స్థిరపడ్డారు. పలువురి స్ఫూర్తిగా నిలిచారు.

ఆ దంపతులు డిగ్రీ చదివారు. కుటుంబ పోషణతో పాటుగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు స్వయం ఉపాధిని మార్గంగా ఎంచుకున్నారు. ఒకరు పాల పుట్టగొడుగులు, మరొకరు నాటు కోళ్ల పెంపకాన్ని ఉపాధిగా ఎంచుకున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణం కురువ పేటకు చెందిన దంపతులు అరుణకుమారి, ఉదయ్‌కుమార్‌ రెండేళ్ల కిందట మోక్ష మష్రూమ్స్‌ను ప్రారంభించారు. ఇది కొలిక్కి వచ్చిన తర్వాత పుట్టగొడుగుల పెంపకం బాధ్యతను భార్యకు అప్పగించి ఉదయ్‌కుమార్‌ నాటుకోళ్ల పెంపకం ప్రారంభించారు.

పుట్టగొడుగుల పెంపకం..

పెట్టుబడి.. వ్యయం:
* కిలో 150 చొప్పున 50 కిలోల విత్తనానికి రూ.7,500.
* స్టెరిలైజరేషన్‌ ఫార్మలిన్‌ లీటరు రూ.450
* కార్భండిజం కిలో రూ.100
* డెటాల్‌ రూ.100
* ప్లాస్టిక్‌ కవర్లు, రబ్బరు బ్యాండ్లు రూ.150
* వరి గడ్డి రూ.1000
* మొత్తం రూ.9,400 అవుతుంది.
* గడ్డిని ఆరబెట్టుకునేందుకు టార్పాలిన్‌, నీటి కోసం డ్రమ్ము అవసరం అవుతాయి.
* కిలో గడ్డికి 600 గ్రాములు పుట్టగొడుగులు వస్తాయి.
* 50 కిలోల విత్తనానికి 30 కిలోల పుట్టగొడుగుల దిగుబడి వస్తుంది.
* ఇలా మూడు కోతలు వస్తాయి.
* మార్కెట్‌లో కిలో రూ.400 చొప్పున విక్రయిస్తే కోతకు రూ.12 వేలు వస్తాయి.

విధానం:
* పాల పుట్టగొడుగుల పెంపకానికి వేడితో కూడిన వాతావరణం అవసరం.
* విత్తనం, గడ్డి, మట్టి స్పాన్‌ తీసుకుని గడ్డిని 3, 4 అంగుళాలు కట్‌ చేసుకుని 24 గంటలు నానబెట్టాలి.
* గడ్డిని బాయిల్‌ కూడా చేసుకోవచ్ఛు గడ్డిని క్లీన్‌ చేసేందుకు నీటిలో ఫార్మల్‌డిహైడ్‌ వేస్తారు.
* వాటిలో చిన్న పురుగులు ఉన్నా చనిపోతాయి.
* నీరు కింద పోసిన తర్వాత గడ్డిని ఆర బెట్టుకుని గడ్డిలో 20 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి.
* ప్లాస్టిక్‌ కవరు తీసుకుని మొదటి లేయరు గడ్డి తర్వాత విత్తనం ఇలా ఐదు లేయర్లు విత్తనం వేసుకోవాలి.
* కిలో స్పాన్‌(విత్తనం)కు ఆరు బ్యాగులు చేసుకోవాలి.
* 21 రోజులు డార్క్‌ రూమ్‌లో ఉంచాలి.
* గాలిలో తేమ 85 శాతం, ఉష్ణోగ్రత 35 శాతం ఉండేలా చూసుకోవాలి.
* గడ్డిలో సమస్య ఉంటే పసుపు, నలుపుల్లో కనిపిస్తాయి.
* వాటిని పక్కకు తీసి వేయాలి. తెల్లగా ఉన్నవి ఆరోగ్యంగా ఉన్నట్లుగా గుర్తించి కవరును రెండుగా కత్తిరించాలి.
* 50 కిలోల మట్టికి ఒక్క కిలో చాక్‌ పౌడర్‌ కలిపి కట్‌ చేసిన కవర్స్‌(బెడ్స్‌)పై ఒక అంగుళం మట్టి వేసుకోవాలి.
* మట్టి తడిచేలా నీటి పిచికారీ చేయాలి. ఇలా రోజూ రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.
* వేసవిలో అయితే రెండు సార్లు తప్పనిసరిగా వారం రోజులు చేసుకుంటే సూదిమొనలు లాగా మొలకలు కనిపిస్తాయి.
* 4, 5 రోజులకు 3, 4 అంగుళాలు వస్తుంది.
* పంట కాలం 40 రోజులు. ఒకే బెడ్‌ నుంచి మూడు పంటలను తీసుకోవచ్చు.