Tulsi Cultivation : తులసిసాగుతో అధిక ఆదాయం పొందుతున్న గిరిజనులు

తులసి మొక్కను ఔషధ గుణాల నిధిగా చెబుతారు. తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థ స్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం, గంగాతీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని అనాదిగా పెద్దల నమ్మకం. హిందు సంస్కృతి సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన మొక్కగా దీన్ని కొలుస్తారు. పూజలు, పుణ్యకార్యాల్లో తులసి మొక్కను విరివిగా ఉపయోగిస్తారు.

Tulsi Cultivation : ఔషధ, సుగంధ పంటలకు వాణిజ్యపరంగా మంచి డిమాండ్ వున్నా… తెలుగు రాష్ట్రాల్లో వీటి సాగు నామమాత్రమనే చెప్పాలి. సాగు పట్ల రైతుల్లో సరైన అవగాహన లేకపోవటం, తరచూ ఎదురయ్యే మార్కెటింగ్ ఇబ్బందుల వల్ల మన ప్రాంతంలో వీటి విస్తీర్ణం అంతగా లేదు. అయితే ఇప్పుడు కొన్ని కంపెనీలు బైబ్యాక్ ఒప్పందాలు చేసుకుని రైతులను ప్రోత్సహిస్తుండటంతో ఇటీవలికాలంలో రైతులు సాగుపట్ల ఉత్సాహం చూపిస్తున్నారు.

READ ALSO : Tulsi Farming : తులసి సాగులో యాజమాన్య పద్దతులు!

ఇందులో భాగంగానే విశాఖ మన్యంలో ఓ ఎన్.జి.వో రైతుల చేత తులసిని అంతర పంటగా, ప్రధాన పంటగా రైతులచేత సాగుచేస్తూ.. వారికి అదనపు ఆదాయాన్ని కల్పిస్తోంది. మరి తులసి దేనికి ఉపయోగపడుతుంది.. దీని పంట కాలం ఎంతా..? రైతులకు ఏవిధంగా లాభదాయకంగా ఉందో తెలియాలంటే ఈ ప్రత్యేక కధనం చదవాల్సిందే.

తులసి మొక్కను ఔషధ గుణాల నిధిగా చెబుతారు. తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థ స్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం, గంగాతీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని అనాదిగా పెద్దల నమ్మకం. హిందు సంస్కృతి సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన మొక్కగా దీన్ని కొలుస్తారు. పూజలు, పుణ్యకార్యాల్లో తులసి మొక్కను విరివిగా ఉపయోగిస్తారు.

READ ALSO : Tulsi Cultivation : వాణిజ్య సరళిలో తులసి పంటసాగు పద్దతి!

వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో తులసి ఒక ముఖ్యమైన ఔషధం . శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేస్తూ.. మానసిక వత్తిడిని తగ్గించి, ఆయుర్ శుద్ధి కలిగించే గుణాలు తులసిలో మెండుగా వున్నాయి. తులసి ఆకుకు వ్యాపార విలువ పెరగటంతో.. విశాఖ జిల్లా, చింతపల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతులతో, వాణిజ్యసరళిలో సాగు చేయిస్తోంది సుస్థిర సేంద్రియ వ్యవసాయ సంఘం.

ఇదిగో ఇక్కడ రైతులు నాటుతున్న ఈ పంటే తులసి. సాధారణంగా చింతపల్లి ఏజేన్సీలో వనతులసి సహాజ సిద్ధంగా పెరుగుతుంది. అయితే దీని ఉపయోగాలు తెలిసినా, ఈ మొక్కల ద్వారా కూడా డబ్బుఆర్జించవచ్చిని ఇక్కడి రైతులకు తెలియదు. అందుకే సంప్రదాయ పంటలను సాగుచేసే గిరిజన రైతులను ఒకతాటిపైకి తీసుకొచ్చింది సుస్థిర సేంద్రియ వ్యవసాయ సంఘం. ఈ సొసైటీలో  ఉన్న 550 మంది రైతులకు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను  పరిచయం చేస్తూ.. వారిచేత పండిస్తోంది ఈ సొసైటీ. అందులో భాగంగానే తులసి పంటను సాగుచేయిస్తోంది.

READ ALSO : Planting of Mango Plants : మామిడి మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మూడు నెలల్లోనే చేతికొచ్చే ఈ పంటను , అంతర పంటలుగా, ప్రధాన పంటగా సాగుచేస్తూ.. వచ్చిన దిగుబడిని స్థానికంగా ఉండే కంపెనీలకు విక్రయిస్తోంది. ఇప్పటికే పలు రకాల పంటలను ఇక్కడి రైతులచేత పండిస్తున్న సొసైటీ.. ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్ అయిన తులసిని కూడా పరిచయం చేసింది. దీన్ని ప్రధాన పంటగానే కాకుండా, దీర్థకాలిక తోటల్లో సాగుచేయించడం వల్లా, రైతులకు అదనపు ఆదాయం వస్తోంది. మొత్తంగా సొసైటీ గిరిజన బతుకుల్లో తులసి కాంతులను పూయిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు