Tulsi Farming : తులసి సాగులో యాజమాన్య పద్దతులు!

ముందుగా సిద్ధం చేసుకున్న భూమిలో 40 సెం.మీ 40 సెం.మీ అంతరంతో మొక్కలను నాటుకోవాలి. నాటిన ఒక నెలవరకు వారానికి 2 సార్లు, మెక్కలు కుదురుకున్న తరువాత, వాతావరణ, భూ పరిస్థితులను బట్టి వారానికొకసారి నీరివ్వాలి.

Tulsi Farming : తులసి సాగులో యాజమాన్య పద్దతులు!

Proprietary methods in Tulsi cultivation!

Tulsi Farming : తులసి, కలబంద వంటి ఔషధ గుణాలున్న మొక్కలను సాగు చేసి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు చాలా మంది రైతులు. ముఖ్యంగా తులసి ఔషదగుణాలు ఉన్న మొక్క కావటంతో దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అధిక డిమాండ్ కారణంగా రైతులకు మంచి ఆదాయం వస్తోంది. రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం సైతం ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. తులసి నుండి సుగంధ తైలము తీసి వివిధ పరిశ్రమలల్లో ఉపయోగిస్తారు. మనదేశంలో ఉత్తరప్రదేశ్ లోని రాంపుర, చందౌసీ, కనేజ్, లక్నో, మైనపురి మొదలైన ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తున్నారు.

అన్ని రకములైన భూములలోని ఇది ప్రక్రుతి సిద్ధంగానే పెరుగుతుంది. నీరునిలిచే ప్రదేశాలు పనికిరావు. భూమి పిహెచ్ 5.0 నుండి 8.5 దీనికి అనుకూలం. పర్వత ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు సాగుకు అనుకూలంగా చెప్పవచ్చు. 14 డిగ్రీల నుండి 30 డిగ్రీల వాతావరణంలో ఇది బాగా పెరుగుతుంది. మంచువాతావరణం అనుకూలం కాదు. విత్తనాల ద్వారా ప్రవర్ధనము చేయబడుతుంది. ఎకరానికి 200 గ్రాముల విత్తనం అవసరమౌతుంది. విత్తనానికి 8 రెట్ల ఇసుకతో కలిపి తయారు చేసుకొన్న నారుముళ్లలో ఎప్రిల్, మే నెలలో చల్లుకొని నారు పెంచుకోవాలి. ఒక నెలలో నారు నాటుకువస్తుంది. 8-13 రోజులలో మొత్తం విత్తనం మొలకెత్తుతుంది.

భూమిని ఒకసారి లోతుగా దున్నుకొని పశువుల ఎరువు వేసి, భూమిలో బాగుగా కలిసేట్లు గుంటక తోలుకోవాలి. మొక్కలు నాటే ముందు తిరిగి దున్నుకొని రసాయనిక ఎరువువేసి నాగలితో సాళ్లు తోలుకోవాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే బాగుగా చిలికిన పశువుల ఎరువు ఎకరానికి 6-8 టన్నులు వేయాలి. నత్రజనికి సంబంధించి ఫాస్పరస్ : పొటాష్ : 48:120:24 ఎరువులు వాడుకోవాలి.

ముందుగా సిద్ధం చేసుకున్న భూమిలో 40 సెం.మీ 40 సెం.మీ అంతరంతో మొక్కలను నాటుకోవాలి. నాటిన ఒక నెలవరకు వారానికి 2 సార్లు, మెక్కలు కుదురుకున్న తరువాత, వాతావరణ, భూ పరిస్థితులను బట్టి వారానికొకసారి నీరివ్వాలి. మొక్కలు నాటిన 30 రోజులకు ఒకసారి, 60 రోజుల తరువాత మరొకసారి కలుపు తీసుకోవాలి. ఆ తరువాత మొక్కలు పెరిగి విస్తరించబడిన కలుపు తీసుకొని ఎరువులు అందించాలి.

తులసిలో యూజినాల్. మిథైల్ సిన్నమేట్ ఉంటాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు మందులు తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఒక హెక్టారులో తులసి పండించడానికి కేవలం 15,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది, కానీ 3 నెలల తర్వాత ఈ పంట దాదాపు 3 లక్షల రూపాయల రాబడి ఇస్తుంది.