Vegetable Cultivation : వరితో పాటు కూరగాయల సాగు.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందాలంటే?

Vegetable Cultivation : ప్రకృతి విధానంలో వరి, కంది లాంటి పంటలతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకు కూరల సాగు చేపట్టి, నాణ్యమైన  దిగుబడులను సాధిస్తున్నారు.

Paddy Cultivation

Vegetable Cultivation : మనం తినే ఆహారమే, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే పెద్దలు అనేవారు.. వంటిల్లే పెద్ద వైద్యశాల అని. అదే సూత్రాన్ని ఆచరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే కాకుండా, వినియోగదారుడికి అందించే లక్ష్యంతో, సాగుపథంలో దూసుకుపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో వివిధ రకాల పంటలు, కూరగాయలు సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనేదానికంటే, పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా వుండాలి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు, వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలుస్తున్నాయి. ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా, పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు, సేద్యంపట్ల మరింత భరోసాను నింపుతున్నాయి.

ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా   పాలకోండ మండలం, పిఆర్ రాజు పేట గ్రామానికి చెందిన రైతు, ఖండాపు ప్రసాద్ రావు. తనకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమిలో పలు రకాల పంటలను పండిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు.

రైతులు విక్షణారహితంగా పంటలకు పిచికారి చేస్తున్న పురుగుమందులతో భూమి నిస్సారంగా మారుతోందని ఇటీవల వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రభుత్వం పురుగుమందులు అవసరం లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది.

ఇప్పటికే చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి  మంచి సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రసాదరావు కూడా ప్రకృతి విధానంలో వరి, కంది లాంటి పంటలతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకు కూరల సాగు చేపట్టి, నాణ్యమైన  దిగుబడులను సాధిస్తున్నారు. వాటిని వినియోగదారులకు అధిక ధరకు అమ్మి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

Read Also : Paddy Cultivation : ప్రకృతి విధానంలో కావేరి సన్నాలు సాగు.. అతి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు..

ప్రసాదరావు తన పంటలకు స్థానికంగా దొరకే వ్యర్ధాలతో ఎరువులను తయారు చేసి, పంటలకు అందిస్తున్నారు. చీడపీడల నివారణకు, ఎలాంటి రసాయన మందులను పిచికారి చేయకుండా, సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటిస్తున్నారు. ముఖ్యంగా  పలు రకాల కషాయాలను తయారి చేసి పిచికారి చేస్తున్నారు.

రైతు ప్రసాదరావు పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తూ.. ఆరోగ్యకరమైన అధిక దిగుబడులను పొందుతున్నారు. ఇవి తిని, తాను ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, వినియోగదారులను సైతం ఆరోగ్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు.