Vegetable Farming : కూరగాయ పంటల్లో పురుగులను అరికట్టే విధానాలు

Vegetable Farming : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా మిరప, టమాట, వంగ లాంటి పంటల్లో పొగాకు లద్దెపురుగు, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగులు ఆశించి తీవ్రంగా నష్టం చేకూరుస్తున్నాయి.

Vegetable farming

కూరగాయ పంటల్లో పురుగుల బెడద కారణంగా తీవ్రంగా పంట నష్టం వాటిల్లుతుంది. పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టి సాగుచేసినప్పటికీ.. వాతావరణ మార్పుల కారణంగా పురుగులు ఆశించటంతో.. రైతులకు నష్టాలు తప్పటంలేదు. ముఖ్యంగా మిరప, టమాట, వంగ లాంటి కూరగాయ పంటల్లో పొగాకు లద్దెపురుగు, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగుల బెడద అధికమైంది. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం..

Read Also : Bananna Cultivation : ఆయిల్ ఫాంలో అంతర పంటగా అరటి సాగు

కూరగాయల తోటల్లో పురుగుల ఉధృతి : 
కూరగాయలు మనం తీసుకునే రోజువారి ఆహారంలో ప్రధానపాత్ర వహిస్తాయి. కూరగాయల పంటలు పండించడం ద్వారా రైతులకు, తక్కువ సమయంలో మంచి దిగుబడి, ఆదాయం వస్తుంది. అందుకే చాలా మంది పట్టణాలకు దగ్గరగా ఉండే రైతులు ఎక్కువగా కూరగాయల సాగుకే మొగ్గుచూపుతుంటారు. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా మిరప, టమాట, వంగ లాంటి పంటల్లో పొగాకు లద్దెపురుగు, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగులు ఆశించి తీవ్రంగా నష్టం చేకూరుస్తున్నాయి.

వీటి నివారణకు అధిక డబ్బులు వెచ్చించి పురుగుమందులు పిచికారి చేసినా ఫలితం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం పంటలకు ఆశించే పురుగులు వాటి నివారణకు ఏలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి.

Read Also : Mirchi Crop Cultivation : మిరపను కోసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు

ట్రెండింగ్ వార్తలు