Watermelon Crop Cultivation : పుచ్చతోటల్లో ఉధృతంగావెర్రితెగులు.. అధిగమించేందుకు శాస్త్రవేత్తల సూచనలు

మండుటెండల్లో దప్పిక తీర్చి, శరీరాన్ని చల్లబరిచే  మధురమైన పండు పుచ్చ. తెలుగు రాష్ట్రాల్లో  అధిక విస్తీర్ణంలో సాగు జరుగుతోంది. పుచ్చకాయలో 92 శాతం నీటితో పాటుగా ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్‌లు, విటమిన్ ఎ, సి లు ఎక్కువగా ఉండటమే కాకుండా తక్కువ కాలరీలు ఉంటాయి.

Watermelon Crop Cultivation : సాధారణంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని  పుచ్చను విత్తుతారు. అయితే ఈ పంటకు ఇప్పుడు సంవత్సరమంతా డిమాండ్ వుండటంతో  రైతులు అన్ని సీజన్ లలోను సాగుచేస్తున్నారు. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక ప్రాంతాల్లో పుచ్చకు వెర్రి తెగులు సొకి తీవ్రంగా నష్టపరుస్తోంది. ఇది వైరస్. దీన్ని వ్యాప్తిచేసే పేనుబంకను  సకాలంలో  నివారించటమే ఈ సమస్యకు పరిష్కారం అను సూచిస్తున్నారు  ఖమ్మం జిల్లా  వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డా. హేమంత్ కుమార్.

READ ALSO : Pesara Crop : పెసర పంటలో తెగుళ్లు, నివారణ

మండుటెండల్లో దప్పిక తీర్చి, శరీరాన్ని చల్లబరిచే  మధురమైన పండు పుచ్చ. తెలుగు రాష్ట్రాల్లో  అధిక విస్తీర్ణంలో సాగు జరుగుతోంది. పుచ్చకాయలో 92 శాతం నీటితో పాటుగా ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్‌లు, విటమిన్ ఎ, సి లు ఎక్కువగా ఉండటమే కాకుండా తక్కువ కాలరీలు ఉంటాయి. అంతే కాకుండా దాహాన్ని తీర్చే గుణం కలిగి ఉండటం వల్ల పుచ్చ వినియోగం వేసవిలో అధికంగా వుంది.

READ ALSO : Guava : జామలో తెగుళ్ళు, చీడపీడల నివారణ

అయితే వేడి గాలులు, పొడి వాతావరణం వల్ల, ఈ తోటల్లో వైరస్‌  వ్యాపి అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వెర్రితెగులు ఈ పంటను తీవ్రంగా  దెబ్బతీస్తుంది. దీంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వీటిని సకాలంలో గుర్తించి అరికట్టినట్లైతే మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డా. హేమంత్ కుమార్..

READ ALSO : Pests In Blck Gram : మినుము పంట సాగులో తెగుళ్లు, సస్యరక్షణ చర్యలు!

తక్కువ సమయంలో పంట చేతికొచ్చే పుచ్చ, మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లైతే మంచి  దిగుబడిని సాధించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు