Watermelon Cultivation : అన్ని కాలాలకు అనువైన పుచ్చసాగు

వేసవి వచ్చిందంటే గుర్తుకొచ్చేది పుచ్చకాయ. వేసవి ఉష్టతాపం నుండి ఉపశమనం పొందేందుకు  ప్రతీ ఒక్కరూ ఇష్టంగా తినే పండు పుచ్చ. గతంలో  నదీపరివాహక  ప్రాంతాలకు ఎక్కువగా పరిమితమైన ఈ పంట సాగును కొంతమంది ఔత్సాహిక రైతులు అన్ని ప్రాంతాల్లోను సాగుచేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు.

Watermelon Cultivation

Watermelon Cultivation : పుచ్చ సాగు వేసవికి అనువైన పంట. కానీ ప్రస్తుతకాలంలో అన్ని కాలాలకు అనువైన రకాలు రావడం వలన మన రైతులు అన్ని కాలాలో సాగుచేస్తున్నారు. కానీ పొడి వాతావరణంలోనే  అధిక దిగుబడి వస్తుంటుంది. మార్కెట్ లో కూడా ధర బాగుంటుండంతో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ప్రతి ఏటా వేసవిలో సాగుచేస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు.

READ ALSO : Watermelon Cultivation : ఎల్లో రకం పుచ్చసాగు.. ఎకరాకు రూ. 2 లక్షల నికర ఆదాయం

వేసవి వచ్చిందంటే గుర్తుకొచ్చేది పుచ్చకాయ. వేసవి ఉష్టతాపం నుండి ఉపశమనం పొందేందుకు  ప్రతీ ఒక్కరూ ఇష్టంగా తినే పండు పుచ్చ. గతంలో  నదీపరివాహక  ప్రాంతాలకు ఎక్కువగా పరిమితమైన ఈ పంట సాగును కొంతమంది ఔత్సాహిక రైతులు అన్ని ప్రాంతాల్లోను సాగుచేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు.

READ ALSO : Watermelon Cultivation : పుచ్చసాగుతో నికర ఆదాయం పొందుతున్న కోనసీమ జిల్లా రైతు

ఈ కోవలోకే వస్తారు  పశ్చిమ గోదావరి జిల్లా, టి. నర్సాపురం మండలం, వల్లంపట్ల గ్రామానికి చెందిన రైతు బెజవాడ రాంబాబు. ప్రతి ఏటా వేసవిలో దిగుబడి వచ్చే విధంగా పుచ్చను సాగుచేస్తున్నారు. మరో వారం రోజుల్లో పంట కోయనున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో మంచి ధర లభిస్తోంది. అయితే ప్రకృతి సహకరిస్తే మంచి లాభాలు వస్తాయంటున్నారు.