Cow Dung : ఆవు పేడతో బిజినెస్ చేస్తున్న మహిళ.. 10 మందికి ఉపాధినిస్తూ.. అమెరికాకి కూడా..

Cow Dung : ఆవుపేడతో పిడకలను చేస్తూ అదే వ్యాపారంగా మలుచుకుని ఎందరికో ఉపాధినిస్తున్నారు ఆచంట గ్రామానికి చెందిన చిలుకూరు సత్యవతి.

Cow Dung Making Business

Cow Dung : వ్యవసాయ భూములు సారవంతం కావాలంటే పశువుల పేడను ఏదో ఒక రూపంలో వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుండి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వరకు.. పశువుల ఎరువు దగ్గర నుంచి పంచగవ్య, అమృత్పానీ, జీవామృతం వరకు.. అన్నిటిలోనూ మోతాదు మారినా.. పేడ వాడకం మాత్రం తప్పనిసరి.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

మరి ఇప్పుడు అదే పేడతో టూత్ పౌడర్, హోమం పిడకలను తయారు చేస్తూ.. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ గృహిణి. ఇంట్లో పాడిపశువులు ఉంటే ఇల్లాలికి చేతి నిండా పనే కాదు.. చేతిలో డబ్బులు కూడా ఉంటాయి. ఇంట్లో చిల్లర ఖర్చుల కోసం పిల్లల అవసరాల కోసం పాడి డబ్బులనే వాడుకుంటారు గృహిణిలు.

కానీ పాడితో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్మకాలే కాదు పేడతో కూడా డబ్బులు సంపాదించేస్తారు అతివలు ఉన్నారు. ముఖ్యంగా ఆవుపేడకు ఇటీవల డిమాండ్ పెరిగిన కారణంగా అతివలు ఇంట్లో ఉండే ఆవుపేడను అవతల పారేయకుండా ఆవుపేడనే ఆదాయవనరుగా మార్చుకున్నారు.

Read Also : Agriculture Tips : 4 ఎకరాల్లో 150 రకాల పండ్లతోట నిరంతరం ఆదాయం

అలా ఆదాయవనరుగా మార్చుకున్న వారిలో పశ్చిమగోదావరి జిల్లా, ఆచంట గ్రామానికి చెందిన చిలుకూరు సత్యవతి ఒకరు. 8 ఏళ్ళుగా దేశీ ఆవులను పెంచుతూ.. వాటి నుండి వచ్చిన వ్యర్థాలతో పలు ఉత్పత్తులు తయారుచేసి అమ్ముతూ.. లాభాలను ఆర్జిస్తున్నారు. అంతే కాదు తనతో పాటు పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు.