Mahua Flower : గిరిజనులకు కల్పతరువుగా ఇప్పపువ్వు.. ఉప ఉత్పత్తులతో ఉపాధి పొందుతున్న మహిళలు

ప్రతి ఏడాది ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు ఆకురాలే కాలం. మార్చి నుండి మే వరకు పూలు రాలే కాలం. గిరిజనులు చింత పండు, జీడి పిక్కలు  సేకరణతో పాటు మరోవైపు విప్ప పువ్వుల సేకరణలో బిజీగా కనిపిస్తుంటారు. ఏ గ్రామం చూసిన విప్పపూల సువాసన వెదజల్లుతోంది.

Mahua Flower

అటవీ ఉత్పత్తుల్లో ఒకటైన విప్పపువ్వు.. గిరిజనులకు ఆదాయ వనరుగా మారింది. గిరిజన ప్రాంతంలో జీడి, చింత, కరక్కాయతో పాటు సహజసిద్ధంగా లభించే విప్ప పువ్వును అటవీ ప్రాంత ప్రజల బతుకుతెరువుగా భావిస్తారు. అలాంటి విప్పపువ్వు పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా లభిస్తుంది. మరి, ఈ విప్ప పువ్వు ఏ కాలంలో దొరుకుతుంది, గిరిజనులు ఎలా సేకరిస్తారు, వారికి ఎలా ఉపయోగపడుతుంది, ప్రయోజనాలేమిటీ తదితర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

READ ALSO : Sustainable Agriculture : పామాయిల్, కొబ్బరి, డెయిరీ తో సుస్థిర వ్యవసాయం

కొండకోనల్లో జీవించే గిరిజనులకు ప్రకృతి వనరులే జీవనాధారంగా ఉంటాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా లభించే వివిధ రకాల పండ్లు, పంటలు గిరిజనులకు ఆహార సంపదతో పాటు ఆదాయ వనరులుగా ఉపయోగపడుతుంటాయి. ప్రస్తుతం జీడీ, చింతపండు, కరక్కాయ వంటి సహజసిద్ద పంటలతో పాటు విప్ప పువ్వు సేకరణ ద్వారా గిరిజనులు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.

READ ALSO : రైతన్నకు సహాయం: వ్యవసాయం చేస్తున్న బాతులు

పార్వతీపురం మన్యం జిల్లాలోని  ఏజెన్సీ మండలాల పరిధిలో వేలాది ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. ప్రతీ ఏడాది వేసవిలో విప్ప పువ్వు సేకరణలో గిరిజనులు బిజీగా గడుపుతుంటారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు ఆకురాలే కాలం. మార్చి నుండి మే వరకు పూలు రాలే కాలం. గిరిజనులు చింత పండు, జీడి పిక్కలు  సేకరణతో పాటు మరోవైపు విప్ప పువ్వుల సేకరణలో బిజీగా కనిపిస్తుంటారు. ఏ గ్రామం చూసిన విప్పపూల సువాసన వెదజల్లుతోంది.

READ ALSO : Robot In Agriculture : వ్యవసాయంలోకి రోబో.. ఎకరంలో కలుపుతీత ఖర్చు రూ. 50

విప్ప పువ్వులో దివ్యౌషధం గుణాలు కలిగి ఉన్నాయి. విప్పపువ్వు వినియోగించేవారు విశేషమైన ఆరోగ్య లాభాలు పొందుతారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, ఒళ్ళు పట్లు, వాతాలకు దివ్యౌషధం విప్ప పువ్వు.  దగ్గు, శ్వాసకోస వ్యాధులకు కూడా వాడుతుంటారు. విప్ప కాయలను పొడిచేసి పాలలో కలుపుకుని గిరిజన మహిళలు తాగుతారు. దీని వలన బాలింతలు చనుబాలు వృద్ధి అవుతాయని అంటుంటారు. విప్ప పువ్వు తో ఆయుర్వేదిక్ మందులు, నూనె లడ్డు, హల్వా, కేకులు తయారు చేస్తుంటారు. అందుకే విప్ప పువ్వుకు మార్కెట్ లో మంచి డిమాండ్.

READ ALSO : Agriculture : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని, లక్షల జీతాన్ని వదిలి వ్యవసాయం.. పుట్టగొడుగులతో లాభాలు

అడవుల్లో సేకరించిన విప్ప పువ్వును బాగా ఎండబెడతారు. అనంతరం ఆ పువ్వు నుంచి గింజలను వేరు చేసి, మళ్లీ ఎండబెడతారు. అనంతరం వాటిని గానుగ ఆడించి నూనె తీస్తారు. ఈ నూనెను వంటలలో ఉపయోగిస్తుంటారు. అలాగే, ఔషధాలకూ ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో విప్ప నూనె కిలో ధర 50 రూపాయల వరకు పలుకుతుంది. గిరిజనులు ఈ నూనెను విక్రయిస్తూ, ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. గతంలో గిరిజన సహకార సంస్థ ద్వారా విప్ప పువ్వు, విప్ప నూనెను ప్రభుత్వమే కొనుగోలు చేసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో మార్కెటింగ్ కోసం గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు