Robot In Agriculture : వ్యవసాయంలోకి రోబో.. ఎకరంలో కలుపుతీత ఖర్చు రూ. 50

ఒక ఎకరంలో కలుపు తీయడానికి ఏడెనిమిది మంది కూలీల అవసరం. రసాయన మందుల పిచికారీ చేయడానికి, దుక్కి దున్నడానికి కలిపి ఖర్చు ఏడాదికి దాదాపు రూ. 25 వేల వరకు అవుతుంది. అందుకే సాగులో రైతులకు శ్రమను తగ్గించి వ్యవసాయాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఒక రోబోను రూపకల్పన చేశారు ఫామ్ సాథీ స్టార్టప్ సంస్థ.

Robot In Agriculture : వ్యవసాయంలోకి రోబో.. ఎకరంలో కలుపుతీత ఖర్చు రూ. 50

Robot In Agriculture

Robot In Agriculture : వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు, కూలీల కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది గురిచేస్తూ.. సాగును నష్టాల మయం చేస్తోంది . సాంకేతికతతోనే ఈ సమస్యలకు పరిష్కారం చూపగలమని నమ్మిన కొందరు యువకులు.. చిన్న చిన్న యంత్రాలను తయారు చేసి వ్యవసాయంలో వినియోగిస్తున్నారు. ఈ కోవలోనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువ ఇంజనీర్ ఓ చిట్టి రోబో తయారు చేశారు. కలుపు, దున్నకం, పిచికారి లాంటి వ్యవసాయ పనుల్ని  ఈ రిమోట్ రోబోతో చేయవచ్చని తెలిపారు. ఇప్పటికే రైతుల క్షేత్రస్థాయిలో పనులను చేస్తోంది.

READ ALSO : Soil Testing : భూసార పరీక్షలతో తగ్గనున్న.. పంట పెట్టుబడులు

వ్యవసాయంలో రైతు ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు. పంట ఏదైనా కలుపును తొలగించడానికి కూలీలకు అయ్యే ఖర్చు రైతుకు చాలా భారమవుతుంది. ఆ ఇబ్బందిని దూరం చేసి రైతుకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ‘ఫామ్‌ సాథీ’ అనే అంకుర సంస్థ రోబోను తయారుచేసింది. చిన్నపాటి ట్యాంక్ లా కనిపిస్తున్న ఈ రోబో వ్యవసాయంలో కలుపు తీయడం.. దుక్కి దున్నడం.. రసాయన మందులను పిచికారి చేయడం ఈ మూడు పనులను అవలీలగా చేస్తుంది.

ఒక ఎకరంలో కలుపు తీయడానికి ఏడెనిమిది మంది కూలీల అవసరం. రసాయన మందుల పిచికారీ చేయడానికి, దుక్కి దున్నడానికి కలిపి ఖర్చు ఏడాదికి దాదాపు రూ. 25 వేల వరకు అవుతుంది. అందుకే సాగులో రైతులకు శ్రమను తగ్గించి వ్యవసాయాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఒక రోబోను రూపకల్పన చేశారు ఫామ్ సాథీ స్టార్టప్ సంస్థ. రోబో రూపకల్పనలో పరిశోధనకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్ధ అందించింది . పవర్‌ ఛార్జర్‌, బ్యాటరీతో ఈ రోబో పనిచేస్తుంది. ఈ రోబో వల్ల రైతులకు ఆర్థికభారం చాలా తగ్గుతుంది అని ఆ సంస్ధ సీఈఓ సుశాంత్‌ చెబుతున్నారు.

READ ALSO : Jute Cultivation : రూపాయి పెట్టుబడి లేదు.. లాభాలు మాత్రం సూపర్..

ఆరుతడి పంటలకు సరిపడేలా ఈ పరికరాన్ని రూపొందించారు. కూలీలు లేకుండా అరచేతిలో రిమోట్‌ కంట్రోల్‌తో పంటపొలాల్లో ఈ కృత్రిమ రోబొ మిషన్‌తో అన్ని పనులూ చేయవచ్చు. నిర్ధిష్టమైన లోతు దుక్కులు , పొలంలో కలుపు మొక్కలను తొలగిస్తుంది. రసాయన మందుల పిచికారి చేస్తోంది. దీంతో అతి తక్కువ మోతాదులోనే రసాయనాల వినియోగం ఉంటుంది. ప్రస్తుతం జనగామ జిల్లాల్లో రైతుల పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తోంది.

READ ALSO : Cultivation of vegetables : ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు

రైతులు ఈ రోబోను సొంతంగా ఆపరేట్‌ చేయాల్సిన అవసరం లేకుండా ‘ఫామ్‌ సాథీ’ ప్రతినిధులే పొలానికి వచ్చి కలుపు తీస్తారు. ఏడాదంతా సేవలు అందించడానికి రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఈ రోబో వల్ల హానికారక రసాయన మందుల వాడకం తగ్గిపోతుంది. పొలంలోని జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ నేల సారాన్ని పరిరక్షించుకోవచ్చు. ఈ యువ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు రైతుల ఆదాయ వనరులు పెంచేందుకు దోహదపడనుంది. అతి త్వరలో ఆటోమేటిక్ రోబోను  రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.