Jute Cultivation : రూపాయి పెట్టుబడి లేదు.. లాభాలు మాత్రం సూపర్..

సాధారణంగా ఖరీఫ్‌ వరి పంటకు ముందు జనుము విత్తనాలు చల్లి ఏపుగా ఎదిగిన తర్వాత దానిని దమ్ములో దున్నుతారు. దీని వల్ల వరి పొలం సారవంతమై అధిక దిగుబడులు రావడానికి ఈ జనుము ఎంతో ఉపయోగపడుతుంది.

Jute Cultivation : రూపాయి పెట్టుబడి లేదు.. లాభాలు మాత్రం సూపర్..

Jute Cultivation

Jute Cultivation : పత్తి, మిరప లాంటి పంటలకు వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి నష్టాలను చవిచూసి విసుగు చెందిన రైతులు.. పంటమార్పిడి వైపు దృష్టిసారించారు. తక్కువ ఖర్చుతో.. చీడపీడల బాధ లేకుండా లాభాలను తీసుకొచ్చే జనుము సాగు చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. బైబ్యాక్ ఒప్పందం ప్రకారం తెలంగా సీడ్స్ కొనుగోలు చేస్తుండటంతో ఇటు మార్కెటింగ్ సమస్య కూడా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : Redgram : కందిపంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు!

తక్కువ ఖర్చుతో రైతులకు లాభాలను ఇచ్చే పంట జనుము. ఆదిలాబాద్ జిల్లా, బోథ్ మండలం, పొచ్చెర గ్రామంలోని  రైతులు జనుమును సాగు చేపట్టారు. సాధారణంగా ఖరీఫ్‌ వరి పంటకు ముందు జనుము విత్తనాలు చల్లి ఏపుగా ఎదిగిన తర్వాత దానిని దమ్ములో దున్నుతారు. దీని వల్ల వరి పొలం సారవంతమై అధిక దిగుబడులు రావడానికి ఈ జనుము ఎంతో ఉపయోగపడుతుంది.

అయితే విత్తన కొరతతో తెలంగాణ సీడ్స్ కార్పోరేషన్ రైతులచేత బైబ్యాక్ ఒప్పందంపై జనుమును సాగుచేయిస్తున్నారు. ప్రస్తుతం జనము పూత, కాత దశలో ఉంది. ఎటువంటి పెట్టుబడి లేకుండా పురుగుల మందు బాధ పెద్దగా లేకుండా ఈ పంట పండుతుంది.

READ ALSO : Green Gram Cultivation : వేసవి పెసర సాగులో మేలైన యాజమాన్యం…అందుబాటులో అధిక దిగుబడినిచ్చే రకాలు

సేద్యంలో రైతు పూర్తిగా  రసాయనిక ఎరువుల పైనే ఆధారపడటం వల్ల సాగులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.  సేంద్రీయ ఎరువులు వాడక పోవటం వల్ల భూసారం తగ్గి , దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి.  పెట్టుబడి భారం పెరుగుతోంది.

ఈసమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట పైర్లను ప్రోత్సహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే విత్తనాలకోసం రైతులకు పౌండేషన్ సీడ్ అందించి.. బైబ్యాక్ ఒప్పందంపై సాగుచేయిస్తున్నారు.