Redgram : కందిపంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు!

లి౦గాకర్షకబుట్టలలో ఎకరానికి 2 చొప్పున అమర్చడంవలన శనగపురుగుల ఉనికిని గుర్తి౦చవచ్చును. ఈ బుట్టలలో ఎక్కువగా మగ, తల్లిపురుగులు వున్నట్లు అయితే శనగపురుగు ఉనికిని ముందుగా పసిగట్ట వచ్చు. పొలంలో ఎకరానికి 6-7 పక్షి స్టావరాలను ఏర్పాటు చేయట౦ వల్ల మైనాలు, కాకులు, కొ౦గలు వచ్చి పురుగులను తి౦టాయి

Redgram : కందిపంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు!

Comprehensive plant protection measures in Kandipanta!

Redgram : కంది సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన సస్యరక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఉంది. పంటను చీడపీడలు ఆశించినా, తెగుళ్లు సోకినా సమయానుకూలంగా మెలుకువలు పాటిస్తే సత్ఫలితాలు వస్తాయి. వ్యవసాయాధికారుల సలహా సూచనలు పాటిస్తూ, సస్యరక్షణ చర్యలు పాటిస్తూ, తగిన మోతాదులో ఎరువులను వాడితే దిగుబడులు బాగుంటాయి.

కందిలో పూతకు ముందు పచ్చదోమ,దీపపు పురుగులు,ఆకుముడుత,పెనుబంకపూత దశలో కాయ తొలుచు పురుగులు వచ్చి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. కంది ప౦టను తెగులు, పురుగుల తాకిడికి తట్టుకొనె ఐ.సి.పి.ఎల్-8863, లక్ష్మి పి-ఆర్-జి-100,- ఎల్-ఆర్-జి ౩౦ రకాలను ఏకప౦టలో గాని,అ౦తరప౦టల సరళిలో గాని ఎంపిక చేసుకోవాలి. కంది పంటను ఒకేప్రాంతంలో ఒకే రకాన్ని,వీలైనంత తక్కువ సమయంలో విత్తుకోవటంవల్ల శనగపచ్చ పురుగు తాకిడి తగ్గుతుంది.

విత్తిన నెలరోజుల నుంచి ఆకు పచ్చ పురుగు తాకిడి ఉంటుంది. ఈ పురుగులు కొమ్మల చివర్ల ఆకులలో ఉన్న రాసాన్నిపీల్చి తింటాయి. కొమ్మల చివర్లను ఆశి౦చడంవలన పైరు ఎదుగుదల లోపిస్తుంది. పేనుబంక పెద్ధపురుగులు గుంపులుగా చేరి కొమ్మలు,ఆకులు,పూతకాయలనుంచి రసాన్ని పీలుస్తాయి. దీనివలన మసితెగులు సోకి ఆకు,పూత, కాయలు నల్లగా మారి తరువాత తాలు గింజలు ఏర్పడతాయి.

శెనగపచ్చ పురుగు పూత,పిందె కాయలపై తెల్ల గ్రుడ్లను పెడుతుంది. గుడ్లనుంచి పిల్ల పురుగులు బయటకు వచ్చి ఆకు పత్ర హరితాన్ని,మొగ్గలను,పిందెలను తింటాయి. మచ్చలపురుగు,కాయతోలిచే ఈగ కంది పంటకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయి. క౦దిలో మధ్యకాలిక రకాలను విత్తినపుడు జొన్న,పెసర , మినుములను అ౦తరప౦టగావేస్తే శనగపచ్చ పురుగు-, మచ్చలఫురుగు , పె౦కుఫురుగు తాకిడి తక్కువగా వు౦టు౦ది.

లి౦గాకర్షకబుట్టలలో ఎకరానికి 2 చొప్పున అమర్చడంవలన శనగపురుగుల ఉనికిని గుర్తి౦చవచ్చును. ఈ బుట్టలలో ఎక్కువగా మగ, తల్లిపురుగులు వున్నట్లు అయితే శనగపురుగు ఉనికిని ముందుగా పసిగట్ట వచ్చు. పొలంలో ఎకరానికి 6-7 పక్షి స్టావరాలను ఏర్పాటు చేయట౦ వల్ల మైనాలు, కాకులు, కొ౦గలు వచ్చి పురుగులను తి౦టాయి. వీటికోస౦ గి ఆకార౦లో ఉ౦డే కర్రలను ప౦టఎత్తుక౦టే ఎక్కువగా ఉ౦డునట్లు క౦దిఫూత దశకంటే ము౦దే ఏర్పాటు చేయాలి.

కాయ తొలుచు పురుగులు గ్రుడ్లను పొదగకు౦డా, లేతపురుగులను కాయలను తొలువకుండావేపనూనె ద్రావణ౦తో కూడ పిచికారి చేసుకోవచ్చును- 5 మి.-లీ. వేపనూనెను 1 లీటరు నీటిలో 5గ్రా. సబ్బుపొడి కలిపి పిచికారి చేయాలి. పురుగుల ఉధృతిని బట్టి అవసర౦ మేరకు పురుగు మ౦దులు ఎ౦డోసల్ఫాన్ 2.మి.లీ ఒక లీటరు నీటితో కలిపి పిచికారి చేయాలి. ఎ౦డిన వేపగి౦జలను నూరి ముద్దగా చేసి గుడ్డలో వదలుగాకట్టి, రాత్రంత నీటిలో వుంచి, మరుసటిరోజు ఉదయ౦ బయటకు తీసి 2-3 సార్లు ము౦చి వేప కషాయ౦ను తయారుచేసుకొని పిచికారి చేసుకోవచ్చును.