Michael Teaser: పాప్ కింగ్ “మైఖెల్” జాక్సన్ బయోపిక్.. టీజర్ వచ్చేసింది.. మీరు చూశారా?
వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ మైఖెల్ జాక్సన్ గురించి ప్రత్యేకమైన పరిచయం(Michael Teaser) అవసరం లేదు. తన పాటలు, డాన్స్ తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
Michael Jackson biopic Michael movie teaser released
Michael Teaser: వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ మైఖెల్ జాక్సన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన పాటలు, డాన్స్ తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పాప్ కింగ్ జీవిత కథ ఆధారంగా “మైఖెల్” అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జాఫర్ జాక్సన్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కిస్తున్నాడు. తౌరా హరియర్, నియా లాంగ్, (Michael Teaser)జులియానో వల్ది కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. తాజాగా “మైఖెల్” సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. మైఖెల్ జాక్సన్ జీవితంలో జరిగిన ప్రతీ విషయాన్ని ఈ సినిమాలో క్లియర్ గా చూపించనున్నట్టుగా అర్థం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2026 ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Spirit: ప్రభాస్ తమ్ముడిగా స్టార్.. అన్నలానే మెప్పిస్తాడా.. మాస్టర్ ప్లాన్ వేసిన సందీప్
