Spirit: ప్రభాస్ తమ్ముడిగా స్టార్.. అన్నలానే మెప్పిస్తాడా.. మాస్టర్ ప్లాన్ వేసిన సందీప్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉందంటే అది స్పిరిట్(Spirit) అనే చెప్పాలి. దానికి, కారణం ఒకరకంగా ప్రభాస్ అయితే.. అసలు కారణం మాత్రం సందీప్ రెడ్డి వంగా అనే చెప్పాలి.
Daggubati Abhiram to play Prabhas younger brother in Spirit movie
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉందంటే అది స్పిరిట్ అనే చెప్పాలి. దానికి, కారణం ఒకరకంగా ప్రభాస్ అయితే.. అసలు కారణం మాత్రం సందీప్ రెడ్డి వంగా అనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ కంటే, (Spirit)సందీప్ రెడ్డి వంగా ఆయన్ని ఎలా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీనే ఎక్కువగా ఉంది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే మోస్ట్ వైలెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు సందీప్. అలాంటి వ్యక్తికి ప్రభాస్ లాంటి స్టార్ దొరికితే ఆ ఔట్పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. అదే స్పిరిట్.
Nainika Anasuru: డ్యాన్సర్ నైనిక.. ట్రెడిషనల్ లుక్ లో అందం కేక..
చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. ఇక ఈ సినిమా కోసం స్టార్ యాక్టర్స్ ని రంగంలోకి దించుతున్నాడు సందీప్. ఇప్పటికే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్, త్రిప్తి డిమ్రీ లాంటి స్టార్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆలాగే ఈ సినిమాలో కొరియన్ స్టార్ డాన్ లీ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా కోసం మరో స్టార్ రంగంలోకి దిగుతున్నాడట. ఆ స్టార్ మరెవరో కాదు దగ్గుబాటి హీరో అభిరామ్. అవును, స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తమ్ముడి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందట.
అలాంటి పాత్రల్లో ఒక ప్రత్యేకమైన స్టార్ ఉంటే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట సందీప్. అందుకే, దగ్గుబాటి అభిరామ్ ను ఫైనల్ చేశాడట. స్పిరిట్ ఆఫర్ రాగానే కనీసం కథ కూడా వినకుండా వెంటనే ఒకే చెప్పేశాడట అభిరామ్. ఇక గతంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమాలో దగ్గుబాటి రానా విలన్ గా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్పిరిట్ కోసం రానా తమ్ముడు అభిరామ్ ను వాడేస్తున్నాడు ప్రభాస్. మరి ఆ సెంటిమెంట్ ఈ సినిమా కోసం ఏ రేంజ్ లో వర్క్ అవుతుందో చూడాలి. ఇక అభిరామ్ విషయానికి వస్తే, డైరెక్టర్ తేజ తెరకెక్కించిన అహింస సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అది ప్లాప్ అవడంతో మరో సినిమాను స్టార్ట్ చేయలేదు ఈ హీరో. మరి స్పిరిటి సినిమాలో తన పాత్రతో ఏ మేరకు మెప్పిస్తాడు అనేది చూడాలి.
