Samsung Galaxy S24 Ultra : అమెజాన్ కిర్రాక్ ఆఫర్.. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!
Samsung Galaxy S24 Ultra : కొత్త శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S24 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తుంది. క్వాడ్ కెమెరా సిస్టమ్ హైక్వాలిటీ షాట్‌లను అందిస్తుంది. అమెజాన్‌లో ఈ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో పాటు కొనుగోలుపై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది. ఇంతకీ ఈ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ధర తగ్గింపు : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 12GB ర్యామ్ వేరియంట్ అమెజాన్‌లో అసలు లాంచ్ ధర రూ. 1,29,999 నుంచి రూ. 84,999కు కొనుగోలు చేయవచ్చు

అదనంగా, అన్ని అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఈ శాంసంగ్ ఫోన్ కొనుగోలుపై అదనంగా రూ. 2,549 అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వైలెట్ అనే 3 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, అడ్రినో 750 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ 7 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

ఈ శాంసంగ్ ఫోన్ 6.8-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా ఆర్మర్, డీఎక్స్ యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP ప్రైమరీ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ 12MP ఫ్రంట్ స్నాపర్ కూడా కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో పాటు 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
